Moviesమెగాస్టార్ దెబ్బ‌తో ఆ డైరెక్ట‌ర్‌కు పెద్ద షాకే... ఊహించ‌ని ట్విస్ట్ ఇది...!

మెగాస్టార్ దెబ్బ‌తో ఆ డైరెక్ట‌ర్‌కు పెద్ద షాకే… ఊహించ‌ని ట్విస్ట్ ఇది…!

టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ యేడాది ఏప్రిల్లో త‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టించిన ఆచార్య సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ఘోరంగా నిరాశ ప‌రిచింది. ఆచార్య త‌ర్వాత వ‌రుస‌గా మూడు సినిమాలు చిరు చేస్తున్నాడు. మ‌ళ‌యాళ హిట్ మూవీ లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోన్న గాడ్ ఫాద‌ర్ సినిమా, మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్‌, బాబి ద‌ర్శ‌క‌త్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు లైన్లో ఉన్నాయి.

 

ఇందులో ముందుగా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న గాడ్ ఫాద‌ర్ రిలీజ్ అవుతోంది. ముందుగా గాడ్ ఫాద‌ర్‌ను ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌నుకున్నారు. త‌ర్వాత ఆచార్య గాయాలు పూర్తిగా మ‌ర్చిపోయాక రిలీజ్ చేయాల‌ని సెప్టెంబ‌ర్ అంటున్నారు. ఆ త‌ర్వాత వాస్త‌వంగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే భోళా శంక‌ర్ రిలీజ్ అవ్వాలి. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా న‌టిస్తోంది.

గాడ్‌ఫాద‌ర్ త‌ర్వాత ఈ సినిమా షూటింగే స్టార్ట్ అయ్యిది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్త‌య్యింది. అయితే అనూహ్యంగా సంక్రాంతి రేసులో వాల్తేరు వీర‌య్య‌ను దించుతున్న‌ట్టు ఈ రోజు ప్ర‌క‌టించేశారు. అంటే మెహ‌ర్ ర‌మేష్ సినిమా వాయిదా వేసేసిన‌ట్టు క్లీయ‌ర్‌గా క‌నిపిస్తోంది. గాడ్‌ఫాద‌ర్ త‌ర్వాత చిరు ముందుగా మెహ‌ర్ ర‌మేష్ సినిమాకే డేట్లు ఇచ్చేశారు.

బాబి సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇస్తుండ‌గా… మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. సినిమా పెద్ద బ్యాన‌ర్లో వ‌స్తోంది. శృతీహాస‌న్ హీరోయిన్‌. ఈ సినిమాకు సంక్రాంతి స్లాట్ ఇవ్వాల‌ని ముందుగా నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే భోళా శంక‌ర్‌ను కాద‌ని ఈ సినిమాను రంగంలోకి దించేశారు. దీనిని బ‌ట్టి చూస్తుంటే మెహ‌ర్ ర‌మేష్‌కు మెగాస్టార్ అదిరే షాక్ ఇచ్చార‌ని చెప్పాలి.

 

ఆచార్య ప్లాప్ అవ్వ‌డం వెన‌క రిలీజ్ టైమింగ్ కూడా రాంగ్ అన్న‌ది ఓ కార‌ణం. అందుకే త‌న‌కు క‌లిసొచ్చిన సంక్రాంతి స్లాట్‌ను చిరు వ‌దులుకోకూడ‌ద‌ని డిసైడ్ అయిపోయారు. అందుకే వాల్తేరు వీర‌య్య కోసం భోళా శంక‌ర్‌ను వెన‌క్కు జ‌రిపేసిన‌ట్టే క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news