Moviesఉత్కంఠ రేపిన స‌మంత ' య‌శోద ' ఫ‌స్ట్ గ్లింప్స్‌... విడాకుల...

ఉత్కంఠ రేపిన స‌మంత ‘ య‌శోద ‘ ఫ‌స్ట్ గ్లింప్స్‌… విడాకుల త‌ర్వాత ఫ‌స్ట్ హిట్ (వీడియో)

నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. తెలుగులోనే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కత్వంలో శాకుంత‌లం సినిమా చేసింది. ఇక య‌శోద అనే థ్రిల్ల‌ర్ సినిమాలో న‌టిస్తోంది. కోలీవుడ్‌లో ఆమె న‌య‌న‌తార‌తో క‌లిసి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన కేఆర్కే సినిమా కూడా ఇటీవ‌లే రిలీజ్ అయ్యింది. అలాగే కార్తీ హీరోగా మ‌రో సినిమాకు ఓకే చెప్పింది. అటు బాలీవుడ్‌లో రెండు హాట్ వెబ్ సీరీస్‌ల‌లో న‌టిస్తోంది.

అటు హాలీవుడ్‌లో కూడా స‌మంత చేసే సినిమాకు టెస్ట్ షూట్ జ‌రిగింది. తాజాగా ఈ రోజు స‌మంత య‌శోద సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. య‌శోద సినిమా పక్కా థ్రిల్లర్ ఙానర్. ఈ గ్లింప్స్ ను చాలా ఆసక్తిగా క‌నిపిస్తోంది. ఫ‌స్ట్ గ్లింప్స్‌లోనే ఈ సినిమా క‌థ ఏంటి ? జాన‌ర్ ఏంట‌న్న‌ది దాచేందుకు ద‌ర్శ‌కులు హ‌రీష్ – హ‌రి ఏ మాత్రం ప్ర‌య‌త్నించ‌లేదు. ఫ‌స్ట్ గ్లింప్స్‌లోనే లైన్ ఎలా ? ఉండ‌బోతోంద‌న్న‌ది క్లారిటీ ఇచ్చేశారు.

థ్రిల్లింగ్ సినిమాయే అయినా క‌థ‌ను ఎలా చూపించ‌బోతున్నార‌న్న ఉత్కంఠ అయితే ఉంది. ఆసుప‌త్రి బెడ్ మీద క‌ళ్లు తెర‌చిన య‌శోద త‌న డ్రెస్‌తో పాటు చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌ను గ‌మ‌నిస్తూ ఉంటుంది. కిటికికి ఆవ‌త‌ల ఉన్న పావురాన్ని అందుకోవాల‌ని ట్రై చేస్తుంది. అక్క‌డితోనే ఆ గ్లింప్స్ ఆగిపోతుంది. ఏదో ట్విస్ట్ ఉంద‌న్న‌ది చెప్ప‌క‌నే చెప్పేశారు.

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తో ఎన్నో సినిమాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా ఈ సినిమా తెర‌కెక్కింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌తో పాటు ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్లింప్స్ చూస్తుంటేనే సినిమాకు హిట్ క‌ళ క‌న‌డ‌ప‌డుతోంది.

స‌మంత‌కు విడాకుల త‌ర్వాత ఫ‌స్ట్ హిట్ సినిమా య‌శోద అయ్యేలా ఉంది. పాన్ ఇండియా లెవ‌ల్లో ఐదు భాష‌ల్లో రిలీజ్ అవుతోన్న ఆ సినిమాను ఆగ‌స్టు 12న రిలీజ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news