రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్‌లో ఎవ్వరూ ఊహించని దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న వర్థమాన నటి ప్రత్యూష మృతిచెందడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రత్యూష అప్పట్లో కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్. మోహన్‌బాబు రాయుడు సినిమాలో ఆయనకు కూతురుగా నటించిన ప్రత్యూష ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. దివంగత వర్థమాన హీరో ఉదయ్‌కిరణ్‌కు జోడీగా కలుసుకోవాలని సినిమాలో రెండో హీరోయిన్‌గా నటించింది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె మంచి ఆఫర్స్ దక్కించుకుని దూసుకుపోయింది. అందంతో పాటు మంచి అభినయం కూడా ప్రత్యూష సొంతం. దీంతో ఆమెతో నటించేందుకు యంగ్ హీరోలు ఉత్సాహపడేవారు. ఓ తెలుగు అమ్మాయికి ఆ రోజుల్లో అంత క్రేజ్ రావడం గొప్ప విషయమే. ప్రత్యూష 23 ఫిబ్రవరి, 2002లో అనుమానాస్పదంగా మృతిచెందింది.
తన స్నేహితుడు / ప్రియుడు అయిన సిద్ధార్థ్‌రెడ్డితో కలిసి ఆమె కోకాకోలాలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుందన్న టాక్ వచ్చింది. అయితే ప్రియుడు సిద్ధార్థ్‌రెడ్డి బ్రతకగా.. ప్రత్యూష మాత్రం చనిపోయింది. ఈ మరణం తర్వాత చాలా చాలా అనుమానాలు వచ్చాయ్. ప్రత్యూష ప్రేమను ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న పుకారు కూడా బయటకు వచ్చింది.
అయితే ఇక్కడే మరో టాక్ కూడా అప్పట్లో బలంగా వినిపించింది. ఆమెపై కొందరు హత్యాచారం చేసి చంపేశారన్న ప్రచారం జరిగింది. కొంతమంది వైద్యులే స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టారన్న ప్రచారం జరిగింది. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో పాటు మొత్తం ముగ్గురు కలిసి ప్రత్యూషపై హత్యాచారం చేసి హతమార్చారని.. అయితే నిందితులు అందరూ పెద్ద, పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వారు కావడంతో ప్రత్యూషది ఆత్మహత్య అని తప్పుదోవ పట్టించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఏదేమైనా ప్రత్యేష మృతి తర్వాత నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పెద్దల వారసులు కావడంతో వాళ్ల పలుకుబడితో ఈ కేసును చాలా త్వరగానే క్లోజ్ చేసిపడేశారు. ఏదేమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ వర్థమాన తార ఇలా ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోవడం చాలా బాధాకరం.