Moviesఅత్త‌గా విజ‌య‌శాంతి... అల్లుడిగా ఎన్టీఆర్‌... కాంబినేష‌న్ కేక‌...!

అత్త‌గా విజ‌య‌శాంతి… అల్లుడిగా ఎన్టీఆర్‌… కాంబినేష‌న్ కేక‌…!

కొన్ని కాంబినేష‌న్లు విన‌డానికి భ‌లే విచిత్రంగా ఉంటాయ్‌. నిన్న‌టి త‌రం హీరోయిన్ల‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారిలో న‌గ్మా, ర‌మ్య‌కృష్ణ ఇద్ద‌రూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అత్త‌లుగా న‌టించి మెప్పించిన వారే. పైగా ఇద్ద‌రూ పొగ‌రు బోతు అత్త‌లుగా చేసి ఎన్టీఆర్‌ను ఢీ కొట్టారు. ముందుగా న‌గ్మా అల్ల‌రి రాముడు సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగ‌ర్వాల్‌కు తల్లిగా చేసింది. న‌గ్మా – ఎన్టీఆర్ మ‌ధ్య వ‌చ్చే డైలాగులు, సీన్లు ఈ మాస్ సినిమాను హిట్ చేశాయి.

త‌ర్వాత మ‌రోసారి నా అల్లుడు సినిమాలో కూడా ర‌మ్య‌కృష్ణ ఎన్టీఆర్‌కు అత్త‌గా చేసింది. అలాగే ర‌మ్య‌కృష్ణ‌, న‌గ్మా కంటే సీనియ‌ర్ న‌టి అయిన విజ‌య‌శాంతి కూడా ఎన్టీఆర్‌కు అత్త‌గా చేస్తే ఆ కాంబినేష‌న్ కూడా కెవ్వు కేక అనేలా ఉండేది. అయితే ఆ కాంబినేష‌న్ మ‌నం మిస్ అయ్యాం. అత్త‌గా విజ‌య‌శాంతి, అల్లుడిగా ఎన్టీఆర్‌ను మ‌నం ఓ సినిమాలో చూసే ఛాన్స్ తృటిలో మిస్ అయ్యింది. అదే అల్ల‌రి రాముడు సినిమా.

ఈ సినిమా ద‌ర్శ‌కుడు బి. గోపాల్‌, నిర్మాత ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల, అటు ప‌రుచూరి సోద‌రులు ముగ్గురు క‌లిసి అత్త క్యారెక్ట‌ర్‌లో ఎవ‌రిని ? పెట్టాలా ? అని చ‌ర్చించుకుంటోన్న టైంలో ముందుగా విజ‌య‌శాంతి పేరు అయితే బాగుంటుంద‌ని చంటి అడ్డాల అన్నార‌ట‌. ఆల్‌మోస్ట్ విజ‌య‌శాంతి ఎన్టీఆర్‌కు అత్తగా సెట్ అయ్యింది అనుకుంటోన్న టైంలో కాస్త ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండే అత్త అయితే బాగుంటుంద‌ని అనుకున్నార‌ట‌.

విజ‌య‌శాంతి త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ పేరు అనుకుని.. ఆ త‌ర్వాత న‌గ్మా అయితే బాగుంటుంద‌ని ప‌రుచూరి గోపాల‌కృష్ణ చెప్ప‌డంతో న‌గ్మాను సెల‌క్ట్ చేశార‌ట‌. న‌గ్మా అప్ప‌టికే చాలా సినిమాల్లో నెగిటివ్, ర‌ఫ్ క్యారెక్ట‌ర్లు, కాస్త ఇగో ఉన్న క్యారెక్ట‌ర్లు చేసింది. ఆమె అయితేనే ఎన్టీఆర్‌కు స‌రి జోడి అయిన అత్త అని గోపాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు గోపాల్ డిసైడ్ చేయ‌డంతో చివ‌ర‌కు చంటి అడ్డాల న‌గ్మాకు క‌థ చెప్పి ఈ క్యారెక్ట‌ర్ క్లిక్ అయితే మ‌ళ్లీ నువ్వు హీరోల‌తో సమాన‌మైన రెమ్యున‌రేష‌న్ తీసుకునే రేంజ్‌కు వ‌స్తావు.. నీ కెరీర్ బాగుంటుంద‌ని ఒప్పించాడ‌ట‌.

అనుకున్నట్టుగానే సినిమాలో న‌గ్మా క్యారెక్ట‌ర్ బాగా పండింది. ఎన్టీఆర్ – న‌గ్మా సీన్లు కేక పెట్టించేశాయి. అయితే న‌గ్మా, ర‌మ్య‌కృష్ణ ఇద్ద‌రూ ఎన్టీఆర్‌కు అత్త‌లుగా చేసినా విజ‌య‌శాంతిని మాత్రం మ‌న ఆ క్యారెక్ట‌ర్‌లో చూడ‌లేక‌పోయాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news