Movies' ఆచార్య‌ ' కు ఓటీటీలోనూ ఘోర అవ‌మాన‌మే మిగిలిందా...!

‘ ఆచార్య‌ ‘ కు ఓటీటీలోనూ ఘోర అవ‌మాన‌మే మిగిలిందా…!

థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన పెద్ద సినిమాలు గట్టిగా నెల రోజులు తిర‌గ‌కుండానే ఆ సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో సినీ వీక్ష‌కుల ఆనందానికి అవ‌ధులు లేకుండా ఉంది. ఈ యేడాది రిలీజ్ అయిన భీమ్లానాయ‌క్‌, రాధేశ్యామ్‌, త్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ 2, ఆచార్య వ‌రుస పెట్టి ఓటీటీలోకి వ‌చ్చేశాయి. కొన్ని సినిమాలు అయితే వారం ప‌ది రోజులు తిర‌క్కుండానే వ‌చ్చేస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా ఈ నెల 20న ఓటీటీలోకి వ‌చ్చింది. కేజీయ‌ఫ్ 2 సైతం అమోజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అదే రోజు త్రిబుల్ ఆర్ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అయితే, అమోజాన్‌లో ఆచార్య‌ను వ‌దిలారు. ఇక థియేట‌ర్ల‌లో ఆచార్య సినిమా బిగ్ డిజాస్ట‌ర్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కలిసి న‌టించినా కూడా ప్రేక్ష‌కులు ఘోరంగా తిర‌స్క‌రించారు. విచిత్రం ఏంటంటే ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 50 కోట్ల షేర్ కూడా రాబ‌ట్టలేదు.

వెండితెర‌పై భారీ న‌ష్టాలు చూసిన ఆచార్య ఇటు బుల్లితెర‌మీద కూడా ప్లాప్ అయ్యింది. ఓటీటీలో ఈ సినిమాకు ఏ మాత్రం ప్రేక్ష‌కాదార‌ణ ద‌క్క‌లేదు. ఇదే రోజు త్రిబుల్ ఆర్‌, ఇటు కేజీయ‌ఫ్ 2 కూడా ఓటీటీలోకి వ‌చ్చేశాయి. ఈ రెండు క్రేజీ సినిమాల మ‌ధ్య‌లో ఆచార్య‌ను చూసేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. దీంతో ఓటీటీలో ఈ సినిమాకు చాలా త‌క్కువ క్లిక్స్ మాత్ర‌మే ప‌డుతున్నాయంటున్నారు.

థియేట‌ర్ల‌లో ఈ సినిమా మినిమం వ‌సూళ్లు కూడా ఎలా రాబ‌ట్టుకోలేక‌పోయిందో ఇప్పుడు ఓటీటీలోనూ సేమ్ అదే ప‌రిస్థితి ఎదుర్కొంటోంద‌నే చెప్పాలి. ప్రేక్ష‌కులు అంద‌రూ కూడా త్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ 2 సినిమాను చూసేందుకే ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. ఏదేమైనా బుల్లితెర ప్రేక్ష‌కులు సైతం కంటెంట్ లేని సినిమాలు చూస్తూ టైం వేస్ట్ చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరోల‌కు అయినా ఇది త‌ప్ప‌డం లేదు అనేందుకు ఆచార్య‌నే పెద్ద ఉదాహ‌ర‌ణ‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news