టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్‌బాబు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడంతో పాటు సినిమాకు ప్రి రిలీజ్‌బజ్ బాగుండడంతో మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యధికంగా రు. 131 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ ఆటలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియర్ టాక్ ప్రకారం సర్కారు వారి పాట సినిమా ఎలా ? ఉందో చూద్దాం.
సినిమా ఫస్టాఫ్ విశయానికి వస్తే సూపర్బ్ అన్న టాక్ వినిపిస్తోంది. మహేశ్‌బాబు ఎంట్రీ.. కామెడీ ఫైట్‌తో పాటు రెండు సాంగ్స్ అదరగొట్టేశాయి. ముఖ్యంగా మహేశ్‌బాబు – కీర్తి సురేశ్ మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ బాగా ఆకట్టుకుంది. మహేష్ ఇంట్రడక్షన్, యాక్షన్ ఎపిసోడ్… వెన్నెల కిషోర్ కామెడీ… అమెరికా నుంచి వైజాగ్ వచ్చి సముద్రఖనికి వార్నింగ్ ఇవ్వడం అన్ని బాగున్నాయి. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌కు కీర్తి – మహేష్ రొమాంటిక్ ట్రాక్, సాంగ్స్, కామెడీ హైలెట్ అయ్యాయి.
సెకండాఫ్‌లో ఫ్లాట్ కథనం ఉన్న కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దాడు పరశురాం. కామెడీలో మహేష్‌బాబు వన్ మ్యాన్ షో చేశాడు. సెకండాఫ్‌లో కథనం అంతా సీరియస్‌గా నడుస్తుంది. సెకండాఫ్‌లో మ..మ మహేశా సాంగ్‌తో పాటు థమన్ బీజీఎం… కొన్ని డైలాగ్‌లు ప్లస్ పాయింట్స్. కథ మరియు దర్శకత్వం పరంగా పరశురాం ఇంకాస్త బెటర్ వర్క్ చేసి ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది.
ఇక ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న బ్యాంకు కుంభకోణాలు.. పెద్దోళ్లు బ్యాంకులను ఎలా ? దోచుకుంటున్నారు ? మధ్య తరగతి వాళ్లను బ్యాంకులు రికవరీ కోసం ఎంతలా వేధిస్తున్నాయన్న పాయింట్‌ను బాగా చూపించాడు. అక్కడక్కడ కాస్త రొటీన్ అనిపించినా అది పెద్ద కంప్లైంట్ కానే కాదు. సరిలేరు నీకెవ్వరు కంటే చాలా బెటర్ అంటేనే సినిమా బ్లాక్‌బస్టర్ అని అర్థం చేసుకోవాలి. ఓవరాల్‌గా మహేష్ ఫ్యాన్స్‌కు డబుల్ బ్లక్‌బస్టర్…మామూలు ఆడియెన్స్‌కు బ్లాక్‌బస్టరే ఈ సర్కారు వారి పాట.