సాయి పల్లవి.. ఓ హైబ్రీడ్ పిల్ల. గ్లామరస్ రోల్ కి దూరంగా..ఇష్టమైన పాత్రలకి దగ్గరగా ఉంటుంది. నచ్చక పోతే మొహానే స్మైల్ తో చెప్పేస్తుంది. ఎదుటి వారు ఎంతటి పెద్ద హీరో అయినా సరే..తనకు కధ నచ్చకపోతే నో చెప్పేయడం సాయి పల్లవి కి అలవాటు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ తో నటించే ఛాన్స్ లు వస్తేనే రిజెక్ట్ చేసింది. డబ్బు మీద ఆశ లేదు..ఇండస్ట్రీలో హీరోయిన్ గా నే సెటిల్ అవ్వాలనే ఆలోచన లేదు..ఇంకెందుకు భయం. తనకు వచ్చిన వాటిల్లో నచ్చిన రోల్స్ చేసి అభిమానులను మెప్పిస్తుంది.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే వావ్..సూపర్,..టూ గుడ్ యాక్టింగ్ అంటూ కుర్రాళ్ళ మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఆ ఇష్టం తోనే ఎంతటీ కష్టమైన స్టెప్పులను కూదా అలవోకగా నేర్చుకునేది.
ఆ ఇష్టంతోనే చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసి శభాష్ అనిపించుకుంది. తెలుగు టెలివిజన్ డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొన్న సాయిపల్లవి.. ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆ తరువాత ఫిదా తెచ్చిన క్రేజ్ తో తెలుగులో స్టార్స్ సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది.
ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు ఆమెను లేడీ పవర్ స్టార్ అంటున్నారు. కాగా రీసెంట్ గా పాల్గోన్న ఇంటర్వ్యుల్లో ఆమె ఫెవరేట్ హీరోలు ఎవరు అని అడగ్గా..”కమల్ హాసన్, మమ్మూటి, సూర్య” అంటూ జవాబు ఇచ్చి..వీళ్లల్లో కమల్ సార్ అంటే చాలా చాలా ఇష్టమని..ఆయన నటించిన సినిమాల పోస్టర్స్ పేపర్లో వస్తే కట్ చేసి దాచుకున్నాను అని..అవి ఇంకా తన దగ్గర జాగ్రత్త గా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఆమె నటించిన విరాట పర్వం రిలీజ్ కు రెడీ గా ఉంది.