Moviesఆ మూవీ చూసి బాగా ఏడ్చేసిన మహేశ్ బాబు (వీడియో) ..!!

ఆ మూవీ చూసి బాగా ఏడ్చేసిన మహేశ్ బాబు (వీడియో) ..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో..మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని కృష్ణ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ..తన నటనటో టాలెంట్ తో..కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న క్రేజీ హీరో. మహేశ్ బాబు స్టైల్ కే సగం మంది పడిపోతారు. ఇక ఆయన సింప్లిసిటీ చూస్తే ముచ్చటేస్తుంది అంటారు ఫ్యాన్స్. ఎంత ఎదిగిన ఓదిగి ఉండటం ఆయన దగ్గరే నేర్చుకోవాలి..ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు.

ఇప్పటికే టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన మహేష్ బాబు..తాజా గా మరోసారి బాక్స్ ఆఫిస్ ని షేక్ చేశాడు. సర్కారు వారి పాట సినిమాతో అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. ఇక మహేశ్ కేవలం సినిమాలతోనే కాకుండా ఎన్నో సామాజిక సేవలతో ఇండ‌స్ట్రీలో ముందున్నాడు. ఆయన సాయం చేస్తే అందరిలాగా చెప్పుకోరు..పేపర్లో,మీడియాలో రావాలని అనుకోరు..ఆయన వ్యక్తిత్త్వం అలాంటిది.

ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయన..పీకాక్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన ర్యాపిడ్‌ ఫైర్‌ ఛాలెంజ్‌లో పాల్గొని..తనకు ఎదురైన ప్రశ్నలకు..ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇస్తూ అభిమానులనౌ ఉత్సాహ పరిచారు. ఈ క్రమంలోనే ఆయన..ఎక్కువగా బ్యూటిఫుల్‌ అనే పదం వాడుతుంటానని..అలాగే ఒక్కవేళ తనకు ఛాన్స్ వస్తే ..తాను డైరెక్టర్ అయితే..తాను హీరోగా నటించిన ‘ఒక్కడు’ మూవీని రీక్రియేట్‌ చేస్తానని చెప్పరు. అంతేకాదు మీకు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిన మూవీ ఏంటి అనగా..హాలీవుడ్‌ మూవీ లయన్‌ కింగ్‌ చూసి ఏడ్చేసిన్నట్లు చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news