సాధారణంగా మనలో చాలామందికి స్టార్ సెలబ్రిటీల ఇష్టాఇష్టాలు గురించి తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్ళ ఇష్టమైన హీరో హీరోయిన్ లు ఎవరు అని..వాళ్ల ఫేవరేట్ ఫుడ్ ఏంటి అని..వాళ్ళ హాబీస్..డ్రెస్సింగ్ స్టైల్..ఇలా చాలా విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకప్పుడు అంటే కష్టం కానీ..ఇప్పుడు అలాంటి వర్రీ అవ్వాల్సిన ప్రాబ్లమ్‌స్ నే లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని తమ అభిమానుల హీరోలు గురించి..హీరోయిన్ ల గురించి అన్ని విషయాలు..ఇట్టే తెలిసిపోతున్నాయి.
కొందరు యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా తమ అభిరుచులను పంచుకుంటుంటే.. మరికొందరు ఇంటర్వ్యుల్లో తన ఇష్టా ఇష్టాల గురించి చెప్పుతున్నారు. అవి కాస్త నెట్టింట ప్రత్యేక్షమవుతున్నాయి. దీంతో వాళ్ళకు సంబంధించిన కొన్ని టాప్ సీక్రేట్స్ బయటపడుతున్నాయి. రీసెంట్ గా అలాంటిదే..ఓ విషయం నెట్టింట లీకై తెగ వైరల్ గా మారింది. యంగ్ హీరోయిన్ కన్నడ బ్యూటీ కృతి శెట్టి..కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఒక్కే ఒక్క సినిమాతో తన స్దానాని టాప్ ప్లేస్ లో ఫిక్స్ చేసుకుంది. ఉప్పెన ఇచ్చిన హిట్..శ్యామ్ సింగరాయ్ ,,బంగార్రాజు సక్సెస్ లకి కారణమైంది. ప్రజెంట్ అమ్మడు వరుస సినిమా షూటింగ్ లల్లో బిజీ గా ఉంది. రీసెంట్ గా అమ్మడి ఫ్రెండ్ ద్వారా లీకైన మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది. కృతి శెట్టికి చాక్లేట్స్ , స్వీట్స్ ఇష్టపడదు కానీ..అమ్మడుకి బూస్ట్ అంటే చాలా ఇష్టమట. ఇప్పటికి ఇంట్లో బూస్ట్ ని దొంగతనంగా తింటుందట. అంతేకాదు..తనకి నిద్రపోయే ముందు ఎక్కువుగా ఫోన్ చూసే అలవాటు ఉందట..ఫోన్ లో కూడా కార్ట్యూన్స్ ఎక్కువ చూస్తుందట. దీంతో నెటిజన్స్ కృతి కి చిన్నపిలల్ల అలవాట్లు పోలేదు అంటూ..నవ్వుకుంటున్నారు.