Moviesఫైనల్లీ బాయ్ ఫ్రెండ్ గురించి ఓపెన్ అప్ అయిన కృతిశెట్టి..భళే షాక్...

ఫైనల్లీ బాయ్ ఫ్రెండ్ గురించి ఓపెన్ అప్ అయిన కృతిశెట్టి..భళే షాక్ ఇచ్చిందిగా ?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే.. టాలెంట్ తో పాటు..లక్ కూడా ఉండాలి. అప్పుడే తాము అనుకున్న కళలను నెరవేర్చుకోగలరు. అలాంటి టాలెంట్ అదృష్టం రెండు..ఉన్న అమ్మాయే ఈ కృతి శెట్టి. పేరుకు కన్నడ పిల్ల నే అయినా చూడటానికి చక్కటి తెలుగు అమ్మాయిలా ఉంటుంది. అంతేకాదు అందరిని నవ్వుతూ పలకరించే పద్ధతి..నడుచుకునే తీరు..స్టార్ హీరోలను సైతం మెప్పిస్తుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి ఉప్పెన’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ..ఈ కన్నడ సోయగం మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించి.. తెలుగులో చాలా మంది అభిమానుల్ని సంపాదించింది.

 

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది. అంతేకాదు ఆ తరువాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు ..రెండు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. దీంతో కృతిశెట్టి దర్శకనిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది. అంతేకాదు వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటుంది. సినిమా ఆఫర్ లతో పాటు.. రోజుకో గాసిప్అమ్మడి పేరు మీద హల్ చల్ చేస్తున్నాయి. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు..స్టార్ హీరోయిన్ స్టేటస్ రాగానే అమ్మడు పై పుకార్లు ఎక్కువైపోయాయి. కొన్ని విషయాలను చూసి చూడన్నట్లు వదిలేస్తున్న కృతి..ఈసారి మాత్రం సీరియస్ అయ్యింది.

గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో..అటు సోషల్ మీడియాలో కృతి శెట్టి బాయ్ ఫ్రెండ్ న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది. ఆమె తనని ఎప్పటి నుండో ప్రేమిస్తుందని..కృతికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టమని..వాళ్ళ ఇంట్లో కూడా ఈ మ్యాటర్ తెలుసని ..ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ మాటలు ఆ నోట..ఈ నోట చేరి..ఫైనల్ గా కృతి చెవిన పడ్డాయి. అంతే పాప కు కోపం పీక్స్ కు వెళ్లిపోయింది. సరిగ్గా అదే టైంకి ఓ ఇంటర్వ్యు కి అటెండ్ అయ్యింది.

ఇదే ప్రశ్న ఎదురైన సమయంలో ..కృతిలోని మరో మనిషి బయటకి వచ్చిన్నట్లు తెగ అరిచేసిందట. “నాకు బాయ్ ఫ్రెండ్ నా..ఎక్కడా..ఎవరు..నాకు తెలియకుండానే నా బాయ్ ఫ్రెండ్ ని మీరు చూశారా..అస్సలు నాకు ప్రేమ దోమ లాంటివి ఏం లేవు. ప్రజెంట్ నా చూపు అంతా సినిమాలపైనే. ఎవరో పని లేని వాళ్ళు ఇలాంటివి స్పెడ్ చేస్తున్నారు. దయచేసి నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చిందట. సదరు రిపోర్టర్ సైతం కృతి కోపాని చూసి షివర్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో కృతి పై ఇలాంటి వార్తలు ఎక్కువైయాయి అనడం మాత్రం నిజం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news