Moviesదర్శకధీరుడు ' జక్కన్న ' రియ‌ల్‌ లైఫ్ స్టోరీ తెలుసా...!

దర్శకధీరుడు ‘ జక్కన్న ‘ రియ‌ల్‌ లైఫ్ స్టోరీ తెలుసా…!

తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి గురించి తెలియని వారు ఉంటారంటే నమ్మశక్యం కాదు. ఈయన తీసే సినిమాలను ఎంతో అద్భుతంగా మలుస్తాడని అందరూ జక్కన్నగా పిలుచుకుంటూ ఉంటారు. జ‌క్క‌న్న ఒక్కో సీన‌న్‌ను శిల్పంలా మలుస్తాడ‌నే జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ పేరు పెట్టాడు. ఈయన రాకతోనే టాలీవుడ్ సినిమా ఒక రేంజ్ కు వెళ్ళింది అని గర్వంగా చెప్పుకోగలము. అయితే బాహుబలి – ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో టాలీవుడ్ లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జక్కన్న. అసలు ఈయనలో ఉన్న ప్రతిభ ఏమిటో అర్ధం కాదు కానీ తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతోంది.

ఇది కేవలం ఆయనకు ఒక్కడికే తెలిసిన మాయో, మంత్రమో అయి ఉండాలి. సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన జక్కన్న దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా చేసే టైంలో భార‌త‌దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ అవుతాడ‌ని గురువు రాఘ‌వేంద్రుడే ఊహించ‌లేద‌ట‌. అప్పటి నుండి స్టూడెంట్ నెంబర్ వన్ మొదలు, తాజాగా రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ వరకు జక్కన్న నుండి వచ్చిన ప్రతి మూవీ ప్రేక్షకుల అభిమానాన్ని పొంది సంచలన విజయాలు అందుకున్నవే కావడం గమనార్హం.

రాజమౌళి సినిమా సినిమాకి తన ప్రతిభను పెంచుకుంటూ పోతూ ప్రపంచాన్నే అబ్బురపరుస్తున్నాడు. ఈయన ఇప్పటి వరకు జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాడు. రాజమౌళి సినిమాలు ఎంత కలెక్షన్లు సాధిస్తాయో ఈయన కూడా అంత భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా కొన్ని సినిమాలకు అయితే చివరగా వచ్చే లాభాలలో 30 శాతం వాటాలు కూడా పొందుతుంటారు. అలా చూస్తే తన కెరీర్‌లో రాజ‌మౌళి భారీగానే ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

రాజమౌళి ప్రముఖ దర్శకుడు మరియు రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ కొడుకు అన్న విషయం తెలిసిందే. ఈయన కూడా కొన్ని రాజమోళి తెరకెక్కించే సినిమాలకు కథలను అందించి ఉన్నాడు. బాలీవుడ్ లో కూడా తాను కథలు అందించిన సినిమాలు హిట్ అయి ఉన్నాయి. అయితే త్వరలో రాజమౌళి – మహేష్ కాంబోలో వ‌స్తోన్న‌ సినిమాకు కూడా జక్కన్న తండ్రే కథను అందిస్తున్నాడు. జక్కన్న‌ 1973 అక్టోబర్ 10 న విజయేంద్ర ప్రసాద్ – రాజనందిని అనే దంపతులకు కర్ణాటకలో ఉన్న రాయచూర్ లో జన్మించాడు.

 

ఈయన ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఇంట‌ర్‌ పూర్తి చేసాడు. రాజ‌మౌళి భార్య రమా కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తూ ఉంది. జక్కన్న ఆస్తులకు కార్తికేయ, మయూక అనే ఇద్దరు వారసులు ఉన్నారు. రాజ‌మౌళి ఎంత పెద్ద ద‌ర్శ‌కుడు అయినా సింపుల్‌గా ఉండేందుకే ఇష్ట‌ప‌డ‌తుంటాడు. హంగుల‌కు, అర్భాటాల‌కు పోవ‌డం ఆయ‌న‌కు ఇష్టం ఉండ‌దు.

ఇంత పెద్ద దర్శకుడు అయిన రాజమౌళి కి ఉన్న ఆస్తులు ఏమిటో ఒకసారి చూస్తే… మ‌న ద‌గ్గ‌ర ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈయనకు నిక‌ర‌ ఆస్తి రూ. 148 కోట్లు ఉందని తెలుస్తోంది. ఇక రాజమౌళికి కార్లు అంటే మహా ఇష్టమట. అయితే చ‌రాస్థుల విల‌వుతో పాటు వాటి మ‌దింపును చేస్తే రాజ‌మౌళి ఆస్తులు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇక రాజ‌మౌళి కార్ల విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం తన దగ్గర BMW 7 సిరీస్, రీసెంట్ గా వోల్వో ఎక్స్ సి 40 ఎస్ యు వి మరియు రేంజ్ రోవర్ లాంటి విలువైన కార్లు తన గ్యారేజ్ లో ఉన్నాయి. ఇక తనకు విలువైన మరియు విలాసవంతమైన భవనాలు హైదరాబాద్, బెంగళూరులలో ఉన్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news