Moviesసాయి పల్లవి షాకింగ్ ఆన్సర్..సమంత, పూజాలు అందుకు పనికి రారు అనేగా..?

సాయి పల్లవి షాకింగ్ ఆన్సర్..సమంత, పూజాలు అందుకు పనికి రారు అనేగా..?

సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు. ఎంత మంది ఉన్నా..కొత్త వాళ్ళకి మన ఇండస్ట్రీ ఎప్పుడు గేట్లు తెరిచే ఉంటుంది. అంత జాలీ దయ గుణం మన వాళ్ళకి. మన తెలుగు హీరోయిన్లకు తప్పిస్తే అందరికి మన డైరెక్టర్ నిర్మాతలు, అవకాశాలు ఇస్తారు. కనీసం తెలుగు హీరోలు కూడా ..మన తెలుగు అమ్మాయిలను పట్టించుకోక పోవడం గమనార్హం.

అయితే, మన తెలుగు అమ్మాయి కాకపోయినా..ఒక్క సినిమా తోనే తన కట్టు బొట్టు..మాట తీరు..అల్లరితనం..సరదాగా కలిసిపోయే గుణం..అన్ని ఉన్నాయి హీరోయిన్ సాయి పల్లవిలో. మన తెలుగు అమ్మాయిలు పక్క ఇండస్ట్రీలోకి వెళ్లి చిట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతుంటే.. మలయాళ ఇండస్ట్రీని నుండి వచ్చి కూడా చాలా పద్ధతిగా..సాంప్రదాయబద్ధంగా డీసెంట్ రోల్స్ చేస్తూ..అంతకంటే డీసెంట్ బట్టలు వేసుకుంటూ..సాయి పల్లవి స్టార్ డైరెక్టర్లను సైతం మెప్పించింది.

రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యుల్లో పాల్గోంది..ఈ క్రమంలోనే ఆమెకు..గ్లామరస్ పాత్రల పై, ఐటెం సాంగ్స్ పై ఊహించని ప్రశ్న ఎదురైంది దీంతో ఆమె నిర్మోహమాటంగా ఆన్సర్ ఇచ్చేసింది. “స్టార్ హీరోయిన్లు అయిన సమంత, పూజా హెగ్డే లు కూడా ఐటెం సాంగ్స్ చేసారు..సమంత ఊ అంటావా మావ సాంగ్ చాలా హిట్ అయ్యింది..అలాగే జిగేళ్లు రాణీ కూడా..అలాంటి టైప్ పాటలు వస్తే చేస్తారా..?”..వెంటనే సాయి రిప్లై ఇస్తూ..

“నో, ఖచ్చితంగా అలాంటివి చేయనండి. నాకు ఇష్టం ఉండదు. నాకు అలాంటి బట్టలు కంఫర్ట్ గా ఉండవు..నేను వేసుకోలేను..వేసుకోను..ఇప్పుడే కాదు నా లైఫ్ లో అలాంటి డ్రెస్లు వేసుకోను..ఆ టైప్ ఆఫ్ పాటలు చేయను అండి”..ఆంటూ మొహానే చెప్పేసింది. దీంతో మరోసారి సాయి పల్లవిని హైలెట్ చేస్తూ…సమంత, పూజా డ్రెస్సింగ్ స్టైల్ పై ఏకిపారేస్తున్నారు జనాలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news