మెగాస్టార్‌ది ఒకటి కాదు రెండు కాదు 150 సినిమాల అనుభవం. ఆయన ఇప్పటి వరకు డైరెక్షన్ చేయకపోయినా.. డైరెక్టర్లు ఎలా సినిమాలు తీస్తున్నారో ? ఆయన కళ్లతో చూస్తేనే అర్థమైపోతుంది. ఇక టాలీవుడ్‌లో గత వారం పది రోజులుగా ఒక్కటే మాట వినిపిస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు అన్నది నిజం.
ఆయన చేస్తోన్న సినిమాల క్వాలిటీని ఆయనే సొంతంగా తన టీంతో పర్యవేక్షిస్తున్నారట. ఆయన నటిస్తోన్న సినిమాల దర్శకులపై ఆయనకు నమ్మకం కుదరడం లేదట.
ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి మూడు సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఆయన రామ్‌చరణ్‌తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత చూస్తే మోహనరాజా దర్శకత్వంలో చేస్తోన్న గాడ్‌ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తోన్న భోళాశంకర్, బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు వరుసగా లైన్లో ఉన్నాయి. ఈ మూడు సమాంతరంగానే షూటింగ్ జరుపుకుంటున్నాయి.
చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు, ఎన్నో ప్లాపులు చూశారు. ఆడియెన్స్ పల్స్ ఏంటన్నది ఆయనకు స్పష్టంగా తెలుసు. ప్రస్తుతం ఆయన చేస్తోన్న దర్శకులు హడావిడిగా పెద్దగా వర్క్ చేయకుండానే సినిమాలను చుట్టేస్తున్నారన్న సందేహం ఆయనకు వచ్చేసిందట. అందుకే తన ఫ్రెండ్స్‌తో పాటు అనుభవజ్ఞులను రంగంలోకి దింపి మరి క్వాలిటీ చెకింగ్ చేయిస్తున్నారట.
తాను చేస్తోన్న మూడు సినిమాల్లో ఓ డైరెక్టర్‌కు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో మూడేళ్లుగా తన వెంట పడుతుంటే ఎట్టకేలకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు సీన్లు తీస్తోన్న తీరు చూసి చిరుయే అవాక్కయ్యారట. అంతన్నావ్.. ఇంతన్నావ్ నువ్వు చెప్పిందేంటి.. ఇప్పుడు తీస్తున్న దేంటి అని గట్టిగా యూనిట్ ముందే క్లాస్ పీకేశారట. ఈ డైరెక్షన్ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావ్ అనడంతో ఆ డైరెక్టర్ తన బాధ ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి.
ఆ డైరెక్టర్ బాధ ఎలా ఉన్నా.. ఇంత పెద్ద సీనియర్లను .. చిన్న డైరెక్టర్లు డైరెక్షన్ చేసినప్పుడు చేసేదేం ఉండదు. హీరోలు చెప్పినట్టు మార్చాల్సిందే.. వాళ్లకు అనుగుణంగా ఉండాల్సిందే. లేకపోతే బతిమిలాడుకుని తన టేకింగ్‌పై నమ్మకం ఉంటే.. అలా కంటిన్యూ చేయాల్సిందే..!