రాను రాను సమాజంలో ఆడవాళ్లకు రక్షణ కరువు అవుతుంది. అప్పుడే పుట్టిన చిన్న పాప దగ్గర నుండి.. మచాన ఉన్న మూసలవ్వ వరకు ఎవ్వరికి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు. రేప్ లు, లైంగిక వేధింపులు అనే వార్తలే ఎక్కువైపోతున్నాయి. సామాన్యులే కాదు.. బడా బడా సెలబ్రిటీలకు కూడా పబ్లిక్ గానే ఇలాంటి పరిస్ధితులు ఎదురవుతున్నాయి. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు..సమాజం ఎంత చెడిపోయిందో.
రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయేషా టాకియాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె తన భర్త తో కలిసి గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు ఎయిర్ పోర్ట్ కు వచ్చిన క్రమంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ సీనియర్ ఆఫీసర్లు హీరోయిన్ తో అసభ్యకరంగా ప్రవర్తించారట. ఈ విషయాని ఆమె భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారాఇంది.
అయేషా టాకియా భర్త ఫర్హన్ అజ్మీ పోస్ట్ చేస్తూ..”డియర్ ఫ్రెండ్స్, నేను నా ఫ్యామిలీతో ‘ఇండిగో 6ఏ 6386’ విమానంలో గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు సిద్దమయ్యాం.ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాం.. అక్కడ కొందరు సీనియర్ ఆఫిసర్లు ఆర్పీసింగ్, ఏకే యాదవ్ ..నా పేరు గట్టిగా అరుస్తూ హెళన చేశారు. అంతేకాదు నా భార్య ని సెక్యూరిటీ చెక్ కోసం వేరో లైన్లో నిలబడమని అంటూ ఆమెను తాక రాని చోట తాకుతూ చాలా అసభ్యకరంగా చీప్ గా ప్రవర్తించాడు.
దీంతో మహిళలను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని నేను అడిగాను. మళ్లీ కూడా డర్టీగా సెక్సువల్ కామెంట్స్ చేశారు. మన దేసంలో ఇలాంటి అవమానకర ఘటన జరగడం..చాలా దారుణంగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి మాకు న్యాయం అందించాలని డిమాండ్ చేస్తున్నా” అంటూ ట్వీట్లో వివరించాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఆ అధికారులను ఏకిపారేస్తున్నారు..సిగ్గుందా అంటూ తిట్టిపోస్తున్నారు. అయేషా సూపర్ సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించింది.
Dear @CISFHQrs
I was boarding for Mumbai on @IndiGo6E 6386, 18:40 hrs flight & these racist officers R P Singh, A K Yadav, commander Rout & senior officer (SP category) Bahadur purposely singled me & my family (wife & son) immediately after they read out my name out loud to team pic.twitter.com/gjHdnFajDN— Farhan Azmi (@abufarhanazmi) April 4, 2022