Moviesఖుషీ సీన్ రిపీట్‌: నువ్వు నా బొడ్డు చూశావ్ అన్న శ్రీముఖి.....

ఖుషీ సీన్ రిపీట్‌: నువ్వు నా బొడ్డు చూశావ్ అన్న శ్రీముఖి.. అన్నీ ముడ‌త‌లేగా అన్న మెగాస్టార్‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా – భూమిక హీరోయిన్‌గా ఎస్‌జె. సూర్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా ఖుషీ. 2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. యూత్ అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాన్ స్టైల్స్‌, లుక్స్‌, మేన‌రిజ‌మ్స్‌కు ఫిదా అయిపోయారు. చాలా యేళ్ల పాటు అప్ప‌టి యూత్ ఖుషీ మేనియాలో మునిగిపోయారు. మెడ మీద చేయి వేసుకుని సిద్ధు సిద్ధార్థ్‌రాయ్ అని చెప్పే డైలాగ్ ఎంత పాపుల‌రో తెలిసిందే. మ‌ణిశ‌ర్మ ఇచ్చిన పాట‌లు కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్‌.

ఇక సినిమాలో అన్నింటికి మించి ప‌వ‌న్.. భూమిక బొడ్డు చూసే సీన్ అల్టిమేట్‌.. అసలు సినిమాను యూత్ ప‌దే ప‌దే రిపీటెడ్గా చూడ‌డంలో ఈ బొడ్డు సీనే కార‌ణం. ఈ బొడ్డు సీన్‌పై చాలా పేర‌డీలు వ‌చ్చినా ప‌వ‌న్ – భూమిక బొడ్డు సీన్‌కు ఏది స‌రితూగ‌లేదు. అయితే ఇప్పుడు ఆ సీన్‌ను ప‌వ‌న్ అన్న మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా రిపీట్ చేస్తున్నారు. ప‌వ‌న్ బొడ్డు సీను.. ఈ వ‌య‌స్సులో చిరు రిపీట్ చేస్తే మామూలు ర‌చ్చ కాదు.. పైగా భూమిక రోల్‌ను పోషించేది ఎవ‌రో కాదు హాట్ యాంక‌ర్ శ్రీముఖి.

చిరంజీవి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్ భోళాశంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలోనే చిరు – శ్రీముఖి మీద ఖుషీ బొడ్డు సీన్ రిపీట్ చేస్తున్నార‌ట‌. అయితే ఈ రీమిక్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంద‌ట‌. నువ్వు నా బొడ్డు చూసావ్ అని శ్రీముఖి… అసలు అక్కడ బొడ్డు ఎక్కడుంది అన్నీ ముడతలేగా అని మెగాస్టార్ మ‌ధ్య ఈ సీన్ చాలా ఫ‌న్నీగా ప్లాన్ చేశార‌ట‌.

ఈ సినిమా చెల్లి సెంటిమెంట్‌తో తెర‌కెక్కుతోంది. చిరు ప‌క్క‌న మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్గా న‌టిస్తోంది. కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా క‌నిపిస్తోంది. సినిమాలో సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో పాటు చాలా ఫ‌న్నీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. యాక్ష‌న్‌కు కూడా స్కోప్ ఎక్కువే ఉంటుంది. సినిమాలో ఫ‌న్నీ సీన్ల‌లో భాగంగానే శ్రీముఖి – చిరు సీన్ ఉంటుంద‌ట‌. ప్ర‌స్తుతం చిరు న‌టించిన ఆచార్య సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌, వాల్తేరు వీర‌య్య లైన్లో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news