Movies' RRR 10 డేస్ ' వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌... సాహోరే...

‘ RRR 10 డేస్ ‘ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌… సాహోరే తార‌క్‌, చెర్రీ, జ‌క్క‌న్న‌…!

రౌద్రం – ర‌ణం – రుధిరం .. త్రిబుల్ ఎట్ట‌కేల‌కు మూడున్న‌రేళ్లు ఊరించి థియేట‌ర్లలోకి వ‌చ్చింది. ఒక‌టా రెండా లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు. ఇవ‌న్నీ దాటుకుని మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ 14 భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ రోజు సినిమా బాగుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకున్నా బాహుబలి 2 రేంజ్ వ‌స్తుందా ? రాదా ? అన్న సందేహాలు ఉన్నాయి. నార్త్‌లో మిన‌హా ఏపీ, తెలంగాణ‌లో అయితే బాహుబ‌లి 2 రికార్డులు 10 రోజుల‌కే బ్రేక్ అయిపోయాయి.

తాజాగా 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 494.20 కోట్ల షేర్ రాబ‌ట్టింది. మొత్తానికి తార‌క్‌, చెర్రీ, రాజ‌మౌళి మూడేళ్ల పాటు ప‌డిన క‌ష్టం ఫ‌లించింది. వారి క‌ష్టానికి సాహోరే అనేలా వ‌సూళ్లు ఉన్నాయి. ఇక గ్రాస్ వ‌సూళ్లు అయితే రు. 800 కోట్లు ట‌చ్ అయ్యాయి. ఏరియాల వారీగా ఈ సినిమా వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 97.00 కోట్లు

సీడెడ్ – 44.50 కోట్లు

ఈస్ట్ – 13.85 కోట్లు

వెస్ట్ – 11.47 కోట్లు

గుంటూరు – 16.34 కోట్లు

ఉత్తరాంధ్ర – 28.12 కోట్లు

కృష్ణా – 12.95 కోట్లు

నెల్లూరు – 07.96 కోట్లు
—————————————
ఏపీ + తెలంగాణ = 232.19 కోట్లు
—————————————-

తమిళనాడు – 33.58 కోట్లు

కేరళ – 9.25 కోట్లు

కర్ణాటక – 36.95 కోట్లు

హిందీ – 91.10 కోట్లు

ఓవర్సీస్ – 84.20 కోట్లు

రెస్ట్ -06.93 కోట్లు
————————————————
10 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 494.20 కోట్లు
————————————————-

ఇక ప‌ది రోజుల నుంచి ఏపీ, తెలంగాణ‌లో టిక్కెట్ రేట్లు త‌గ్గిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రేట్లు ఎక్కువుగా ఉండ‌డంతో ఓ సెక్ష‌న్ ఆఫ్ ఫీపుల్ ఇప్పుడు సినిమాను చూసేందుకు థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. ఉగాది, వీకెండ్ కూడా త్రిబుల్ ఆర్‌కు బాగా క‌లిసొచ్చింది. ఇక కేజీయ‌ఫ్ 2 వ‌చ్చే వ‌ర‌కు త్రిబుల్ ఆర్‌కు సౌత్‌తో పాటు అటు నార్త్‌లోనూ ఎలాంటి ఇబ్బంది లేదు. మ‌రి బాహుబ‌లి 2 రికార్డుల‌కు చేరువ కాక‌పోయినా మ‌రిన్ని రికార్డులు అయితే త్రిబుల్ ఆర్ ఖాతాలో ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news