దర్శకుడు కొరటాల శివ తన సినిమాలపై ఫుల్ క్లారిటీతో ఉంటారు. సినిమా కాస్త లేట్ అయినా.. లెన్త్ ఎక్కువ అయినా.. సీన్లు సాగదీసినట్టు ఉన్నా కూడా కొరటాల తాను అనుకున్న క్లారిటీతోనే సినిమాలు తెరకెక్కిస్తాడు. అందుకే ఆయన సినిమాలకు ఫస్ట్ డే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినా తర్వాత జనాలకు ఎక్కేస్తాయి. కొరటాల ధీమా కూడా అలాగే ఉంటుంది. అయితే ఆయన తాజా సినిమా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విషయంలో మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి అంతా గడబిడ.. గజిబిజీ అన్నట్టుగానే వ్యవహారం నడుస్తోంది.
ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలని ? అన్న విషయంలో కొరటాల ఎంతో కన్‌ఫ్యూజ్‌కు గురయ్యారు. ఎట్టకేలకు చాలా పేర్లు పరిశీలించి చివరకు కాజల్‌ను తీసుకున్నారు. అంతకు ముందే శ్రీయ పేరు కూడా వినిపించింది. ఇక చెర్రీ క్యారెక్టర్‌ను ఎక్కడ ? పెట్టాలి ? ఎలా పెట్టాలి.. ఎంత పెట్టాలన్నదానిపై కూడా కొరటాలకు ముందు క్లారిటీ లేదు. తర్వాత కథను మార్చి చివరకు సెకండాఫ్‌లో ఓ 30 నిమిషాల పాటు ఉండేలా తీర్చిదిద్దారు.
ఇక సంగీత దర్శకుడి విషయంలో కొరటాలకు ముందు నుంచి మణిశర్మ ఇష్టం లేదు. అయితే చిరు పట్టుబట్టి మణిశర్మనే తీసుకునే సరికి అక్కడ కూడా తేడా వచ్చింది. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మణిశర్మను పక్కన పెట్టి మిక్కీ జే మేయర్‌ను తీసుకువచ్చారన్న గుసగుసలు ఈ సినిమా యూనిట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మణిశర్మ అంటేనే బ్యాక్ గ్రౌండ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ నచ్చకే మార్చారట.
అయితే ఈ ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు… మిక్కీ జే మేయర్ ఇచ్చిన ఆర్ ఆర్ కూడా నచ్చక ఇప్పుడు మళ్లీ మణిశర్మ తనయుడు స్వరసాగర్‌కు ఈ బాధ్యతలు ఇచ్చారట. రిలీజ్‌కు ముందు కొరటాలలో ఈ గందరగోళం, గడబిడతో మెగాస్టార్ ఫ్యాన్స్ సైతం ఏం జరుగుతుందా ? అన్న టెన్షన్‌లో ఉన్నారు. ఇక
గతంలో కొరటాల శివకు దేవీ శ్రీ ప్రసాద్ మంచి ఆల్బమ్‌లు, నేపథ్య సంగీతమే ఇచ్చారు.
అయితే ఇప్పుడు చిరు కోరిక మేరకు మణిశర్మ దగ్గరకు వెళ్లడంతో ఇన్ని సార్లు మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చిందని కూడా అంటున్నారు. ఇక ఆచార్య ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.