Moviesన‌ట‌సింహం బాల‌కృష్ణ డ‌బుల్ రోల్లో అద‌ర‌గొట్టిన 16 సినిమాలు... ఆ స్పెషాలిటీలు...!

న‌ట‌సింహం బాల‌కృష్ణ డ‌బుల్ రోల్లో అద‌ర‌గొట్టిన 16 సినిమాలు… ఆ స్పెషాలిటీలు…!

నంద‌మూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది. తండ్రి న‌ట వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్న బాల‌య్య దాదాపుగా నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో త‌న‌దైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూనే ఉన్నాడు. కేవ‌లం సాంఘీక పాత్ర‌లే కాకుండా చారిత్ర‌క పాత్ర‌లు, పౌరాణిక పాత్ర‌లు, కాల్పనిక పాత్ర‌ల్లో కూడా న‌టించి మెప్పించాడు బాల‌య్య‌. గ‌తంలో పౌరాణిక పాత్ర‌ల్లో తండ్రి ఎన్టీఆర్‌కు కాస్తో కూస్తో సాటిరాగ‌ల హీరోను తానే అనిపించుకున్న బాల‌య్య‌.. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి లాంటి సినిమాలో రారాజుగా కూడా అద‌ర‌గొట్టేశాడు.

తాజాగా అఖండ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అఖండ గ‌ర్జ‌న మోగించిన బాల‌య్య మ‌లినేని గోపీచంద్ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. బాల‌య్య డ‌బుల్ రోల్ చేశాడంటే ఆ సినిమా ఎలా ఉంటుందో ? థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్‌కు పూన‌కాలు ఎలా వ‌స్తాయో చెప్ప‌క్క‌ర్లేదు. బాల‌య్య ఒక‌టి కాదు.. రెండు కాదు మొత్తం 16 సినిమాల్లో డ్యూయెల్ రోల్స్ చేశాడు. ఆ సినిమాలేంటో. ఆ క్యారెక్ట‌ర్లు ఏంటో చూద్దాం.

– 1986లో బాలయ్య నటించిన అపూర్వ సోదరులు సినిమాలో డబుల్ రోల్ చేశారు. రాము, అరుణ్ అనే రెండు పాత్ర‌ల్లో బాల‌య్య న‌టించి మెప్పించాడు.
– ఇక త‌న తండ్రి టైటిల్‌తో బాల‌య్య చేసిన రాముడు భీముడు సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో రాముడు – భీముడు అనే పాత్రల‌లో నటించారు.
– బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో కూడా బాలయ్య స‌త్య హ‌రిశ్చంద్ర‌, దృశ్యంతుడు అనే రెండు పాత్ర‌ల్లో న‌టించి న‌టనా ప‌రంగా వీర‌విహారం చేశాడు.

– ఆదిత్య 369 సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. ప్ర‌స్తుత త‌రంలో శ్రీ కృష్ణ‌దేవ‌రాయుల‌తో పాటు కృష్ణ‌కుమార్ అనే ఈ త‌రం న‌టుడిగా రెండు పాత్ర‌ల్లో న‌టించారు.
– ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మాతో పెట్టుకోకు సినిమాలో అర్జున్ – కిట్టయ్య పాత్రల‌లో నటించాడు.
– శ్రీకృష్ణార్జున విజయంలో బాలయ్య డబుల్ రోల్ చేశారు. ఈ సినిమాలో కృష్ణుడు మరియు అర్జున పాత్రలో నటించారు.
– పెద్దన్నయ్య సినిమాలో రామకృష్ణ ప్ర‌సాద్, భవానీ ప్రసాద్ అనే పాత్రల‌లో నటించారు. అలాగే సుల్తాన్‌లో పృథ్వి, సుల్తాన్ అనే పాత్రల‌లో నటించాడు.

– చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి, భరత్ అనే పాత్రల‌లో నటించగా.. అల్లరి పిడుగు సినిమాలో ఏసిపి రంజిత్ – గిరి అనే పాత్రల‌లో నటించాడు.
– ఒక్కమగాడు సినిమాలో రఘుపతి రాఘవ రాజారాం – వీర వెంకట సత్యనారాయణ స్వామిగా న‌టించాడు.
– పాండురంగడు సినిమాలో కృష్ణుడు – పాండురంగడు పాత్రల‌లో నటించాడు.

– పరమవీరచక్రలో మేజర్ జై సింహ, చక్రధర్ పాత్రల్లో నటించాడు.
– అధినాయకుడులో బాలయ్య హరిశ్చంద్రప్రసాద్ – రామకృష్ణ ప్రసాద్ – బాబి మూడు పాత్ర‌ల్లో మెప్పించాడు.
– లెజెండ్ సినిమాలో బాలయ్య జై దేవ్, కృష్ణ గా మెప్పించాడు.
– తాజా బ్లాక్‌బ‌స్ట‌ర్ అఖండలో అఖండ‌, శ్రీనివాస్ గా ద్విపాత్రాభిన‌యం చేసి మెప్పించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news