మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన తాజా సినిమా ఆచార్య. సక్సెస్ ఫుల్ సినిమాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో చెర్రీ నటించిన మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో చిరు గెస్ట్ రోల్స్ చేశారు. కానీ ఆచార్యలో చిరు – చెర్రీ ఇద్దరూ ఫుల్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కొణిదెల ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ చరన్, మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
కరోనా దెబ్బతో ఓవరాల్‌గా మూడున్నర సంవత్సరాల పాటు సుధీర్ఘంగా ఆచార్య షూటింగ్ జరుపుకుందనే చెప్పాలి. మొన్న సంక్రాంతికే ఈ సినిమాను థియేటర్లలో వేస్తారని అనుకున్నారు. అయితే వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వస్తోంది. తాజాగా సెన్సర్ పూర్తి చేసుకున్న ఆచార్య సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 29న రిలీజ్ అవుతోన్న ఆచార్య ప్రమోషన్లు స్పీడ్‌గా జరుగుతున్నాయి.
సినిమా థియేటర్లలోకి రావడం ఒక్కటే మిగిలి ఉంది. అయితే సినిమా ఎలా ఉందన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. సినిమా బాగానే వచ్చిందని.. మేకర్స్‌లో కూడా అదే ధీమా ఉందని తెలుస్తోంది. ఇక ప్రముఖ క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు సైతం ఆచార్యకు తన తొలి రివ్యూ ఇచ్చేశాడు. సినిమాకు ఏకంగా 4 స్టార్ రేటింగ్ ఇస్తూ చిరు, రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఆచార్య మాస్ ప్రేక్షకులకు ఫుల్ మసాలా అని.. చిరు, చెర్రీ తమ నటనతో ఇరగదీశారంటూ ఉమైర్ ఆకాశానికి ఎత్తేశాడు. ఆచార్య మెగాభిమానులకు ఖచ్చితంగా ఫుల్ మీల్స్ అందించేలా ఉంటుందని చెప్పడంతో మెగాభిమానుల ఆనందానికి అవధులే లేవు. సైరా తర్వాత మూడున్నరేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకుని చిరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రామ్‌చరణ్ మాత్రం గతేడాది త్రిబుల్ ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. నెల రోజుల్లోనే మరోసారి ఆచార్యతో దిగుతున్నాడు.
రెజీనా స్పెషల్ సాంగ్‌లో నటించగా… చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. మణిశర్మ స్వరాలు అందించిన ఈ సినిమా ధర్మస్థలి అనే గ్రామంతో పాటు నక్సలిజం నేపథ్యంలో సాగుతుంది. తనికెళ్ల భరణి, సోనూ సూద్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.