Moviesజూనియర్ ఎన్టీఆర్ సంపాదించే కోట్ల డబ్బు ఎలా ఖర్చు చేస్తాడో తెలుసా...?

జూనియర్ ఎన్టీఆర్ సంపాదించే కోట్ల డబ్బు ఎలా ఖర్చు చేస్తాడో తెలుసా…?

నందమూరి వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా ప్రోత్సాహం లేకపోయినప్పటికీ తనంతట తానుగా ఈ స్థాయికి చేరుకున్నారు. ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రేక్షకుల మనసు గెలుచుకుని అనంత అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. నిజానికి తారక్ చిన్నతనంలో తాతగారు నందమూరి తారక రామారావు ప్రోత్సహించారు. ఆయన మరణాంతరం సోలోగానే కష్టపడ్డారట, అలానే హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. స్టార్ డం పెరుగుతున్న కొద్దీ నందమూరి రక్తం తిరిగి ఆ కుటుంబానికి మ‌రింత చేరువైంది.

స్టూడెంట్ నంబర్ 1 మూవీ తోనే అటు దర్శకుడు రాజమౌళి, ఇటు తారక్ ఇద్దరు కూడా తొలిసారి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ తరవాత ఎన్టీఆర్ వరుస చిత్రాలతో బిజీ అయిపోయారు. హిట్ ఫ్లాప్ అన్న తేడా లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకు పోయారు. తన ప్రతిభతో స్టార్ హీరో హోదాను అందుకున్నారు. ఆది, సింహాద్రి, య‌మ‌దొంగ‌, బృందావనం, జనతా గ్యారేజ్, అదుర్స్, అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో వేసుకున్నారు తారక్. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారి తన పాపులారిటీనీ ప్రపంచ నలుమూలలకు విస్తరింప చేసుకున్నారు ఈ హీరో. అయితే యంగ్ టైగర్ ఒక్కో సినిమాకు పారితోషికం ఎంత తీసుకుంటారు, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులను ఏం చేశార‌న్న‌ది తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంటుంది.

తారక్‌కు హైదరాబాద్‌లో ఒక పెద్ద బంగ్లా ఉంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఈ విలాసవంతమైన లగ్జ‌రీ బంగ్లా ఉంది. ఈ బంగ్లా విలువ రు. 25 కోట్ల వరకు ఉంటుంది. అంతే కాకుండా కర్ణాటకలో పలు చోట్ల కూడా తారక్ కు విలాసవంతమైన భవనాలు, ల్యాండ్స్‌ ఉన్నట్లు సమాచారం. బ‌ళ్లారి, రాయ‌చూర్ ప్రాంతాల్లో మంచి విలువైన భూములు, గెస్ట్‌హౌస్‌లు నిర్మాత సాయి కొర్ర‌పాటి ద్వారా తార‌క్ కొనుగోలు చేసిన‌ట్టు టాక్ ? ఇక తారక్ కు కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే మరి కొంత డబ్బును ఖరీదైన కార్లు, బైక్ లను కొనడానికి అధికంగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు.

మార్కెట్లోకి ఏ కొత్త కార్ వచ్చినా తన గ్యారేజ్ లోకి వచ్చి చేరాల్సిందే. లాంభోర్గని యురస్ గ్రాఫైట్ కాప్స్యూల్ అనే మోడల్ కార్‌ను ఇండియాలోనే మొదట సొంతం చేసుకున్న ఓనర్ గా ఘనత అందుకున్నారు. దీని విలువ ఏకంగా రూ.3.16 కోట్లు. అంతే కాకుండా రూ.5 కోట్ల విలువ చేసే ఊరస్ సూపర్ స్పోర్ట్. అలాగే రేంజ్ రోవర్ వోగ్యు కార్ కూడా ఇతను కొనుగోలు చేశాడు. దీని వైలువ అక్షరాలా 1.95 కోట్ల విలువ ఉంది. అదే విధంగా పోర్స్చే 718 కేమెన్ కార్ కూడా 85.95 లక్షల విలువ కలిగి ఉంది. ఇక ఇదే కంపెనీకి చెందిన మరొక కారు విలువ 1.2 కోట్లుగా ఉంది. ఇక బీఎండబ్ల్యు కంపెనీ కి చెందిన 730 LD కార్ విలువ 1.32 కోట్లుగా తెలుస్తోంది.

ఇక తారక్ కు బైక్ ల మీద కూడా మోజు ఎక్కువే. ఇతనికి అత్యంత ఇష్టమైన సుజుకి హయబుజాను రు. 14 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. ఇక ఫారిన్ బైక్ అయిన హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 ను 5.75 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. ఇక తారక్ కు తన వెహికల్స్‌కు నెంబర్ ప్లేట్ విషయంలో ఇష్టమైన 9999 నెంబర్ కోసం ఏకంగా రు. 17 లక్షలు ఖర్చు చేస్తాడట. ఈ నెంబర్ లాంబోర్గిని మరియు బీఎండబ్ల్యు కార్లకు ఉంది. ఇక ఇవే కాకుండా తాను ధరించే వాచ్ ల కోసం కోట్లు ఖర్చు చేస్తాడు. ఇటీవ‌ల తార‌క్ పెట్టుకున్న‌ 11-03 మోడల్ వాచ్ ధర 2.5 కోట్ల రూపాయలు అన్ని తెలుస్తోంది. ఇలా మ‌నోడు సంపాద‌న‌లో చాలా వ‌ర‌కు భూములు, బిల్డింగ్‌ల‌కే కాకుండా కార్లు, బైక్‌లు, వాచ్‌లు కోసం కూడా గ‌ట్టిగానే ఖ‌ర్చు చేస్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news