టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. 2004లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే సుకుమార్ మెగాఫోన్ పట్టి
తొలి ప్రయత్నంలోనే తిరుగులేని విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు సుకుమార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత ఆర్య కథ రెడీ చేసుకుని ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పి చివరగా బన్నీతో సినిమా సెట్ చేసుకున్నారు.
యూత్ కు చాలా కొత్తగా అనిపించినా ఆర్య బాక్సాఫీస్ దగ్గర కాసుల మోత మోగించింది. ఆ తర్వాత బన్నీ – సుకుమార్ కాంబినేషన్ తిరుగులేనిది అయిపోయింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ఆర్య – ఆర్య 2 – పుష్ప సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పుష్ప అయితే ఏకంగా బాలీవుడ్ లో కూడా రు. 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఆర్య తర్వాత బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో దిల్ రాజు బ్యానర్లోనే జగడం సినిమా తెరకెక్కాల్సి ఉందట. ముందుగా ఈ కథను సుక్కు రాసుకుని దిల్ రాజుకు వినిపించగా ఆయనకు చాలా భయం వేసింది అట. ఆ తర్వాత బన్నీకి చెప్పగా బన్నీకి కూడా ఈ కథ నచ్చలేదు. అయితే ఈ విషయాన్ని సుక్కుకు ఎలా ? చెప్పాలో తెలియక ఇద్దరు సతమతమవుతున్నారట. బన్నీ కాస్త డేర్ చేసి కథలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సుకుమార్ ఫీలై పోయాడట.
ఇటు దిల్ రాజు కూడా తటపటాయిస్తూ ఉండడంతో సుక్కు ఒక్కరోజులోనే మీరు చేయకపోతే వేరే నిర్మాత రెడీగా ఉన్నాడు అంటూ ఆదిత్య రామ్ నిర్మాతగా జగడం సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఆడదని దిల్ రాజుకు బన్నీకి ముందే తెలుసు. అయితే సుకుమార్‌తో రిలేషన్ మంచిగా ఉండాలనే జగడం సినిమా ముహూర్తపు షాట్‌కు రాజు – బన్నీ ఇద్దరు వెళ్లారట. ఆ సమయంలో సుకుమార్ కు అటు దిల్ రాజుతో పాటు… ఇటు బన్నీతో కాస్త గ్యాప్ వచ్చింది. చివరకు దిల్ రాజు, బన్నీ అంచనా తప్పలేదు. జగడం సినిమా ప్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఆర్య 2 వీరి కాంబినేషన్ లో వచ్చింది.