Moviesఉదయ్ కిరణ్ చనిపోయే ముందు అర్ధరాత్రి 3 ఆ డైరెక్టర్ తో...

ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు అర్ధరాత్రి 3 ఆ డైరెక్టర్ తో ఏం మాట్లాడాడు …?

టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో పాటు హీరోల వారసులకి ముచ్చెమటలు పట్టించాడు హీరో ఉదయ్ కిరణ్. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. ఒక్క సినిమాతోనే యూత్‌లో తిరుగులేని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు ఉదయ్. ఆ రోజుల్లోనే రు. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి తెలుగు బాక్సాఫీస్ వర్గాల్లో సంచలనం రేపింది.

రెండో సినిమా కూడా తేజ దర్శకత్వంలో నువ్వునేనులో నటించిన ఉదయ్ కిరణ్ ఆ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా అప్పట్లో తెలుగునాట కాలేజీ యూత్ ను ఒక ఊపు ఊపేసింది. నువ్వు నేను సినిమా వచ్చిన వెంటనే మనసంతా నువ్వే సినిమాతో ఉదయ్ కిరణ్ మూడో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. మనసంతా నువ్వేలో సైతం ఉదయ్‌కిరణ్ తొలి సినిమా చిత్రం హీరోయిన్ రీమాసేన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పై ఎం.ఎస్.రాజు నిర్మాతగా విఎన్‌. ఆదిత్య‌ దర్శకత్వంలో తెర‌కెక్కింది.

చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే మూడు సినిమాలు సిల్వ‌ర్ జూబ్లీ జరుపుకున్నాయి. మనసంతా నువ్వే సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ వెంట టాలీవుడ్‌లో అప్పట్లో సీనియర్ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు పోటీప‌డ్డారు. ఒక్కసారిగా నుంచి ఉదయ్‌కిర‌ణ్‌కు పెద్ద ఆఫర్లు వచ్చాయి. పెద్ద నిర్మాతలతో పాటు స్టార్ డైరెక్టర్లు సైతం ఉదయ్ కిరణ్ వెంట పడ్డారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితతో ఉదయ్ కిరణ్ పెళ్లి నిశ్చ‌యం అయ్యింది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వారిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల కారణంగా సుస్మితతో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ జీవితం తలకిందులు అయిపోయింది.

అప్పటివరకు ఉదయ్ కిరణ్ వెంట ప‌డ్డ‌ నిర్మాతలు, స్టార్ డైరెక్టర్లు ఉదయ్ కిరణ్ ను పట్టిచుకోడం మానేశారు. ఏఏం.రత్నం లాంటి అగ్ర నిర్మాత సైతం ఉదయ్ కిరణ్ కు ఇచ్చిన అడ్వాన్స్ లు వెనక్కి తీసుకున్నారంటే ఉదయ్ కిరణ్ పరిస్థితి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఉదయ్ కిరణ్ 5 సినిమాకే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. మనసంతా నువ్వే లాంటి హిట్ సినిమా ఇచ్చిన డైరెక్ట‌ర్ విఎన్‌. ఆదిత్య‌తో కలిసి మరోసారి శ్రీరామ్ సినిమా చేశాడు. ఆ సినిమాలో తనకు మరోసారి హీరోయిన్ గా అనితనే తీసుకున్నారు. అయితే అదే సమయంలో తన గురువు తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా పరిచయం అయిన జయం సినిమా కూడా రిలీజ్ అయింది.

అటు జయం ఇటు ఉదయ్‌ శ్రీరామ్ సినిమాలు పోటాపోటీగా వారం రోజుల తేడాలో బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి. అయితే జ‌యం సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా శ్రీరామ్ భారీ అంచ‌నాలు అందుకోలేకపోయింది. శ్రీ రామ్ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ లో పూర్తి గా డ‌ల్‌ అయిపోయాడు. అటు తనకు హిట్ సినిమాలు ఇచ్చిన తేజకు, వీఎన్‌. ఆదిత్య‌కు కూడా కాలం కలిసి రాక స్టార్ డైరెక్టర్లు కాలేదు. మ‌న‌సంతా నువ్వే, శ్రీరామ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ శ్రీరామ్ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎంతో ఇష్టపడి పెట్టుకున్న కో-డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ కేక‌లు వేయడంతో తాను షూటింగ్ నుంచి వెళ్లి పోయాను అని చెప్పారు.

ఆ కో డైరెక్టర్ డైరెక్టర్ కావలసిన వ్య‌క్తి అని… ఎంతో సిన్సియర్‌గా వ‌ర్క్ చేస్తాడు అని… అలాంటి డైరెక్టర్‌పై ఉదయ్ కిరణ్ మీకు పద్ధతి.. ప్లానింగ్ లేదు అని కేకలు వేయడంతో తాను మనస్థాపానికి గురి అయ్యాను అని చెప్పారు. ఇక ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు ఒక రోజు అర్ధరాత్రి ఫోన్ చేసి మూడు గంటల పాటు తనతో ఫోన్లో మాట్లాడినట్టు కూడా ఆదిత్య తెలిపారు. ఆ రోజు ఉదయ్ కిరణ్ తన భార్య విషితతో కలిసి బెంగళూరులో ఉన్నారని, ప‌బ్‌లో ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మనం ఇద్దరం కలిసి పనిచేద్దాం అన్నా అంటూ తనకు ఎంతో ధైర్యం చెప్పాడని, వాస్తవంగా ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లో ఉన్నా కూడా అతను చెప్పిన మాటలు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఆదిత్య తెలిపారు.

తనతో ఆ రోజు మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడటంతో పాటు పలు విషయాలు సైతం షేర్ చేసుకున్నట్లు ఆదిత్య తెలిపారు. స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం తీరని విషాదం. టాలీవుడ్ లో ఎంతో భవిష్యత్తు ఉన్న వర్ధమాన హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ జీవితం ఇలా ముగియ‌డం ఎప్పటికీ విషాదకరమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news