అసలు గత కొన్నేళ్లలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా కానరావడం లేదు. తెలుగు అమ్మాయిలను చూద్దామంటేనే కష్టం అయిపోతోంది. అలాంటి టైంలో ఈషా రెబ్బా, బింధు మాధవి, అంజలి, అనన్య నాగళ్ల లాంటి వాళ్లు మాత్రమే అరుదుగా క్లిక్ అయ్యారు. పదేళ్ల క్రితమే బిందు మాధవి హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే చిన్నా చితకా అవకాశాలతో సరిపెట్టుకుందే కాని స్టార్ హీరోల పక్కన ఆమెకు ఛాన్సులు రాలేదు.
అయితే ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి పెట్టిన బిందు మాధవి అక్కడ బాగా పాపులర్ అయ్యింది. తెలుగులో ఆవకాయ బిర్యానీ సినిమాతో మంచి గుర్తింపే వచ్చినా ఆ క్రేజ్ ఇక్కడ కంటిన్యూ కాలేదు. ఆ తర్వాత తెలుగు తెరపై పెద్దగా బిందు తళుకులు మెరవలేదు. కోలీవుడ్‌లో మాత్రం కాస్తో కూస్తో గుర్తింపు ఉన్న పాత్రల్లోనే కనిపించింది. అయితే బిగ్ బాస్ పుణ్యమా ? అని మళ్లీ ఇన్నాళ్లకు ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
బిగ్‌బాస్ హౌస్‌లో తనదైన స్టైల్ ఆటతీరుతో అందరిని మెప్పిస్తూ ఉండడంతో పాటు బయట కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తాజాగా బిందు మాధవి లవ్ ఎఫైర్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. ఆమె తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్‌తో ప్రేమలో ఉందని.. అతడినే పెళ్లి చేసుకోబోతోందని అంటున్నారు. వీరిద్దరు గత కొంత కాలంగా రిలేషన్లో ఉన్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది.
తాజాగా హౌస్‌లో ఉన్న బిందు మాధవికి కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ కూడా పెట్టడంతో ఈ అనుమానాలకు మరింత బలం వచ్చినట్లయ్యింది. వీరిద్దరి రిలేషన్‌పై కోలీవుడ్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కళ్యాణ్ ట్వీట్‌తో సపోర్ట్ చేయడంతో ఈ రూమర్లు మరోసారి గుప్పుమన్నాయి. తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో బిందు మాధవి పాల్గొంది.
అదే సీజన్లో కళ్యాణ్ కూడా మరో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ వచ్చింది. తాజాగా మరోసారి ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. బిందు మాధవి హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వీరి పెళ్లి ఉంటుందని అంటున్నారు.