Moviesఎన్టీఆర్ కోసం రంగంలోకి ఇద్ద‌రు బాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు...!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి ఇద్ద‌రు బాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులే లేవు. మామూలుగానే ఎన్టీఆర్ సినిమా వ‌స్తుంది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర‌చ్చ లేపుతారు. అలాంటిది ఎన్టీఆర్ – రాజ‌మౌళి కాంబినేష‌న్లో త్రిబుల్ ఆర్ వ‌స్తుందంటే ఎంత గ‌త్త‌ర లేపుతారో వేరే చెప్ప‌క్కర్లేదు. అస‌లు ఈ రోజు ప్ర‌పంచ స్థాయికి ఎదిగిన రాజ‌మౌళి కెరీర్ స్టార్ట్ అయ్యిందే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌, సింహాద్రి సినిమాల‌తో..! ఆ త‌ర్వాత వీరి కాంబోలోనే య‌మ‌దొంగ సినిమా కూడా వ‌చ్చింది. ఈ మూడు సినిమాలు వేటిక‌వే సూప‌ర్ హిట్లు.

ప్ర‌పంచ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప ద‌ర్శ‌కుడు అయిన రాజ‌మౌళి ఏ హీరోతో కూడా నాలుగు సినిమాలు చేయ‌లేదు. ఒక్క ఎన్టీఆర్‌తోనే ఏకంగా 4 సినిమాలు చేశాడు. ఇక రాజ‌మౌళి ఎందరు హీరోల‌తో సినిమాలు చేసినా ఎన్టీఆరే ఆయ‌న‌కు అభిమాన హీరో.. ఈ విష‌యాన్ని చాలాసార్లు ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పేశారు. ఇక మూడేళ్లుగా ఎన్టీఆర్ సినిమా రాక‌పోవ‌డంతో కాస్త నిరాశ‌లో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల‌కు ఇప్పుడు మ‌రో రెండు రోజుల్లోనే త్రిబుల్ ఆర్ వ‌స్తుండ‌డంతో ఆనంద తాండ‌వం మామూలుగా లేదు.

ఇక త్రిబుల్ ఆర్ రిలీజ్ అవుతుండ‌డంతో ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌పై పూర్తిగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా ప‌ట్టాలు ఎక్కేసింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా అలియా భ‌ట్ పేరు దాదాపు ఖ‌రారైంది. ఆమె త్రిబుల్ ఆర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా క‌నిపించ‌నుంది. ఇక ఇప్పుడు కొర‌టాల ఆమెను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపిక చేశార‌ట‌.

అలాగే కొర‌టాల శివ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఎన్టీఆర్, ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా కాంబినేష‌న్లో మ‌రో సినిమా స్టార్ట్ అవుతుంది. బుచ్చిబాబు ఉప్పెన సినిమా పూర్త‌యిన‌ప్ప‌టి నుంచే ఎన్టీఆర్ సినిమా కోసం క‌థ రాసుకున్నాడు. అప్ప‌టి నుంచి ఆ సినిమా మీదే వ‌ర్క్ చేస్తున్నాడు. ఆల్రెడీ మైత్రీ వాళ్ల‌కు సినిమా క‌మిట్ అయ్యాడు. ఎన్టీఆర్ డేట్స్ కూడా మైత్రీ వాళ్ల ద‌గ్గ‌ర ఉన్నాయి. అందుకే దాదాపు బుచ్చిబాబు – ఎన్టీఆర్ సినిమా సెట్ అయిన‌ట్టే..!

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా దివంగ‌త అతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్ పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్ల‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు. ఈ యేడాది కొర‌టాల శివ సినిమా వ‌స్తే.. ఆ వెంట‌నే బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అయితే వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు రిలీజ్ అవ్వొచ్చు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news