Moviesహిట్ హీరోయిన్‌తో టాలీవుడ్ యంగ్ హీరో స‌హ‌జీవ‌నం...!

హిట్ హీరోయిన్‌తో టాలీవుడ్ యంగ్ హీరో స‌హ‌జీవ‌నం…!

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోలు, హీరోయిన్లు ఘాటుగా ప్రేమ‌ల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఓ టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఇప్పుడు ఓ హీరోయిన్‌తో ప్రేమ‌లో మునిగి తేలుతున్నాడ‌ట‌. అక్క‌డితో ఆగ‌కుండా వారిద్ద‌రు ఇప్పుడు స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ అంతా కోడై కూస్తోంది. అస‌లు విష‌యంలోకి వ‌స్తే విజ‌య్ దేవ‌ర‌కొండ స్ఫూర్తితో చాలామంది తెలంగాణ హీరోలు వెలుగులోకి వ‌చ్చి రాణిస్తున్నారు. ఈ లిస్టులో కొంద‌రు యువ హీరోలు త‌మ యాట్యిట్యూడ్‌తో బాగానే పాపుల‌ర్ అయ్యారు.
ఈ జాబితాలోనే ఓ యంగ్ హీరో కూడా ఉన్నాడు.

స‌ద‌రు యంగ్ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో ఒక‌టి, రెండు హిట్లు ప‌డ్డాయి. ఇప్ప‌డు బాగా బిజీ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఇండ‌స్ట్రీకే చెందిన ఓ యంగ్ హీరోతో హైద‌రాబాద్‌లోనే క‌లిసి సీక్రెట్‌గా కాపురం చేస్తున్నాడ‌ట‌. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి ఓ సినిమాలో న‌టించారు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా టైంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని.. ఇద్ద‌రు సీక్రెట్‌గా ఓ ప్లాట్‌లో కాపురం పెట్టేశార‌ని అంటున్నారు.

ఇక స‌ద‌రు హీరోయిన్ త‌మిళ‌నాడు నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. తెలుగుతో పాటు త‌మిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. కొన్ని హిట్లు కూడా ఉన్నాయి. ఇక స‌ద‌రు హీరోయిన్ గ్లామ‌ర్ డోస్ కంటే పెర్పామెన్స్‌నే ముందు నుంచి న‌మ్ముకుంటుంద‌న్న పేరు అయితే తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వీరిద్ద‌రి స‌హ‌జీవ‌నం నేప‌థ్యంలో వీరు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటారా ? లేదా ఇలా కొంత కాలం టైం పాస్ చేస్తారా ? అన్న‌ది చూడాలి. ఇప్పుడు వీరి లివింగ్ రిలేష‌న్ అయితే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news