Newsరాధేశ్యామ్ ట్రైల‌ర్‌... ప్రేమ VS విధికి మ‌ధ్య అదిరిపోయే వార్ (వీడియో)

రాధేశ్యామ్ ట్రైల‌ర్‌… ప్రేమ VS విధికి మ‌ధ్య అదిరిపోయే వార్ (వీడియో)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. బాహుబ‌లి సీరిస్ సినిమాలు, సాహో త‌ర్వాత ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ప్ర‌భాస్ తాజాగా న‌టిస్తోన్న సినిమా రాధే శ్యామ్‌. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణా మూవీస్ రు. 250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. రెండేళ్లుగా షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా గ‌త సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పుడు మార్చి 11కు వాయిదా ప‌డింది.

పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన రాధే శ్యామ్ 1960వ ద‌శ‌కంలో యూర‌ప్‌లో ఇటలీలో జ‌రిగిన ఓ య‌దార్థ ప్రేమ క‌థ ఆథారంగా తెర‌కెక్కుతోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా రాధే శ్యామ్ యూనిట్ ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేసింది. ట్రైల‌ర్లో భ‌విష్య‌త్తు చెప్పే జ్యోతిష్కుడిగా ప్ర‌భాస్ క‌నిపించాడు.

అంద‌రి చేతి రాత‌లు చూస్తూ ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కూడా ప్ర‌భాస్ చెప్పేస్తుంటాడు. ఓ వ్య‌క్తి ఎప్పుడు చనిపోతాడో చెప్ప‌డం.. దానికి సినిమాలో విల‌న్ల‌కు ఏదో లింక్ ఉంద‌ని తెలుస్తోంది. ఇక జ‌గ‌ప‌తిబాబు త‌న చేయి చూపించి జాత‌కం చెప్ప‌మ‌ని అడిగితే.. తన‌కు రెండోసారి చేయి చూసే అల‌వాటు లేద‌ని చెపుతాడు. ఇక యాక్ష‌న్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ఏదేమైనా సాహో త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ప్ర‌భాస్ ఏం చేస్తాడో ఈ నెల 11న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news