టాలీవుడ్‌లోనే తిరుగులేని క్రేజీ హీరోలుగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ త్రిబుల్ ఆర్. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. మూడేళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు కేవలం రు. 250 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడడంతో వడ్డీల భారం పెరిగిపోయింది.
ఇక ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు రు. 1000 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు చెపుతున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రు. 225 కోట్ల ఆదాయం నిర్మాత దానయ్యకు వచ్చిందట. ఇక ఇద్దరు స్టార్ హీరోలు… పైగా ఫామ్‌లో ఉన్నారు. అటు రాజమౌళికి అసలు అపజయం అన్నదే లేదు. పైగా బాహుబలి సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా.
ఈ సినిమాకు ఒక్కొక్కళ్లు మూడేళ్ల పాటు బల్క్‌గా డేట్లు ఇచ్చేశారు. ఈ లెక్కన చూస్తే రెమ్యునరేషన్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. అయితే వీళ్లు ఈ సినిమాకు కేటాయించిన టైం, పెట్టిన ఎఫర్ట్స్‌తో పోలిస్తే వీళ్లకు ఇచ్చిన రెమ్యునరేషన్లు కాస్త తక్కువే అనుకోవాలి. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు మరో 15 రోజులు ఉండగానే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ అవ్వగా రికార్డుల దుమ్ము రేపుతోంది.
ఓవర్సీస్‌లో మిలియన్ మార్క్ దాటేసిన త్రిబుల్ 1.5 మిలియన్ డాలర్ల బుకింగ్ వసూళ్ల దిశగా దూసుకు పోతోంది. ఇక రెమ్యునరేషన్ల విషయానికి వస్తే కొమరం భీంగా నటించిన ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్‌చరణ్‌కు చెరో రు. 45 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇక కీలక పాత్ర చేసిన బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్‌కు రు. 25 కోట్లు, ఆలియా భట్‌కు రు. 9 కోట్లు ఇచ్చారట.
ఈ సినిమాకు మూల స్తంభం అయిన కెప్టెన్ రాజమౌళి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్యాకేజీ తీసుకోవడంతో పాటు లాభాల్లో 30 శాతం వాటా కూడా తీసుకోబోతున్నాడట. ఈ మేరకు రాజమౌళికి, దానయ్యకు ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్‌తో పాటు డైరెక్టర్ సముద్రఖనికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇక టెక్నికల్‌గా కూడా ప్రతి ఒక్కరికి భారీస్థాయిలో రెమ్యునరేషన్లు ముట్టాయని టాక్ ?