Moviesరాధే శ్యామ్: సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ అంటే ఇదే..డైరెక్టర్ పెద్ద తప్పే...

రాధే శ్యామ్: సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ అంటే ఇదే..డైరెక్టర్ పెద్ద తప్పే చేశాడుగా..?!

భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా “రాధ్యే శ్యామ్”. పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ హస్త రేఖ నిపుణుడు గా నటించిన ఈ సినిమాలో అందలా భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. డైనమిక్ డైరెక్టర్ రాధా కృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ను చూసిన బయటకు వచ్చిన జానాలు రాధే శ్యామ్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

కానీ చాలా మంది సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ మిస్ అయ్యిందని..స్టోరీని చాలా స్లోగా తీసారని..కొన్ని సీన్స్ లో మరీ సుత్తి కొట్టించాడు డైరెక్టర్ అని అంటున్నారు. నటన పరంగా ప్రభాస్ అస్సలు తగ్గలేదు..తనకు ఇచ్చిన రోల్ ని..డైరెక్టర్ చెప్పిన్నట్లు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాగా నటించి తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ డైరెక్టర్ ప్రభాస్ పాత్రను ఇంకొంచెం బాగా డిజైన్ చేసి..ఎక్స్ ట్రా కామెడీ పెట్టుంటే..సినిమా మరింత బాగుండేది అని రివ్యూ ఇస్తున్నారు. ఇక పూజా అందాలు ఈ సినిమాలో కొత్తగా ఉన్నాయని..కొన్ని సీన్స్ లో ఎక్స్ ప్రేషన్స్ ఇరగదీసిందని అంటున్నారు.

సినిమా లో అన్నీ క్యారెక్టర్స్ ని బాగా వాడుకున్న డైరెక్టర్..ప్రభాస్ ఫేవరేట్ హీరోయిన్ భాగ్యశ్రీని మాత్రం సినిమాలో బిస్కెట్ చేశాడు. ఆమె నటన సామర్ధ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహానటి..తన నటనతో అందంతో అప్పట్లో దేశాని ఓ ఊపు ఊపేసింది. అలాంటి ఓ హీరోయిన్ మన చేతికి చిక్కిన్నప్పుడు ఎలా వాడుకోవాలి..నటన పరంగా పిండేయాలి..కానీ డైరెక్టర్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు అంటున్నారు సినిమా చూసిన జనాలు.

ఓవర ఆల్ గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. హిందీ సీరియల్ లా ఉంది. హిందీ వాళ్లు సీరియల్స్ కైన సరే బాగా డబ్బు ఖర్చు చేసి క్లీన్ గా తీస్తారు..అలానే ఉంది ఈ సినిమా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాక్ పరంగా ఎలా ఉన్నా కానీ..ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రభాస్ అభిమానులు ముందే అలా ఫిక్స్ అయిపోయారు,

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news