మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న 14 భాషల్లో థియేటర్లలోకి వస్తోంది. రౌద్రం రణం రుధిరం అనే ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు ఖాళ్షీట్లు ఇచ్చిన ఎన్టీఆర్, చరణ్‌కే నిర్మాత దానయ్య రు. 45 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చాడని టాక్ ?
ఇక దర్శకుడు రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ సినిమాకు వర్క్ చేసినందుకు కొంత ప్యాకేజీ అమౌంట్‌తో పాటు లాభాల్లో కొంత వాటా తీసుకోబోతున్నాడట. గత సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమాకు అప్పట్లో భారీ ఎత్తున ప్రమోషన్లు చేశారు. అయితే ఒమిక్రాన్‌తో పాటు ఏపీలో టిక్కెట్ రేట్లు మరీ తక్కువుగా ఉండడంతో వాయిదా వేశారు. ఇక ఊరిస్తూ వస్తోన్న త్రిబుల్ ఆర్ ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.
ఈ సినిమా రిలీజ్‌కు మధ్యలో 9 రోజుల టైం మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ సెన్షేషనల్ అవుతోంది. రిలీజ్‌కు 21 రోజుల ముందే బుకింగ్స్ స్టార్ట్ చేయగా అమెరికాలో అప్పుడే 1 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు మరో మైల్‌స్టోన్‌కు త్రిబుల్ ఆర్ చేరువైంది. 1.5 మిలియన్ డాలర్ల మార్క్ కూడా త్రిబుల్ ఆర్ క్రాస్ చేసేసిందట.
ఇక రిలీజ్‌కు మరో 9 రోజుల టైం ఉండడంతో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు దాటేసి.. కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లతో 3 మిలియన్ డాలర్లు క్రాస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వసూళ్లు చూస్తుంటేనే ఈ సినిమా కోసం ఓవర్సీస్ జనాలు ఎంత ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారో అర్థమవుతోంది.