Moviesవావ్.. ఆ తార‌క‌రాముడిని గుర్తు చేసిన ఈ తార‌క్‌.. !

వావ్.. ఆ తార‌క‌రాముడిని గుర్తు చేసిన ఈ తార‌క్‌.. !

ప్ర‌స్తుతం భార‌త సినిమా ఇండ‌స్ట్రీ అంతా త్రిబుల్ ఆర్ సినిమా గురించే చ‌ర్చించుకుంటోంది. ఓ వైపు బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా కావ‌డం.. అటు టాలీవుడ్‌లోనే రెండు టాప్ కాంపౌండ్‌ల‌కు చెందిన యంగ్‌స్ట‌ర్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో త్రిబుల్ ఆర్‌పై మామూలు బ‌జ్ లేదు.

రు. 1000 కోట్ల వ‌సూళ్ల టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దండ‌యాత్ర స్టార్ట్ చేయ‌నుంది. మూడేళ్ల నుంచి ఈ సినిమాపై ఎన్నో చ‌ర్చ‌లు.. ఒక‌టి రెండు కాదు.. మూడుసార్లు రిలీజ్ డేట్లు ఎనౌన్స్ అయ్యాక కూడా ఏదో ఒక కార‌ణంతో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. త్రిబుల్ ఆర్ ట్యాగ్ లైన్ చూస్తేనే అరివీర భ‌యంక‌రంగా క‌నిపిస్తోంది. రౌద్రం రణం రుధిరం అన్న ప‌వ‌ర్ ఫుల్ ప‌దాల‌ను చూస్తుంటేనే ఈ సినిమాలో యాక్ష‌న్‌, రౌద్రం స్థాయి ఏ రేంజ్‌లో ఉండ‌బోతోందో అర్థ‌మ‌వుతోంది.

అటు ఎన్టీఆర్‌, ఇటు చర‌ణ్ అభిమానులు అంద‌రూ కూడా ఈ సినిమా కోసం మామూలుగా వెయిట్ చేయ‌డం లేదు. రిలీజ్‌కు మ‌రో 9 రోజులు ఉండ‌గానే ఎక్క‌డిక‌క్క‌డ బెనిఫిట్ షోలు, ప్రీమియ‌ర్ షోల కోసం భారీ ఎత్తున లాబీయింగ్ న‌డుస్తోంది. ఇక యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే చిన్న వ‌య‌స్సులోనే వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. బాల రామాయ‌ణం సినిమాలో రాముడిగా మెప్పించి అప్పుడే తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు అనిపించుకున్న తార‌క్‌.. య‌మ‌దొంగ సినిమాలో యంగ్ య‌ముడిగా అల్ల‌క‌ల్లోల‌మే రేపాడు.

ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో ఏ పాత్ర‌లో అయినా న‌టించ‌గ‌ల హీరో ఎన్టీఆర్ మాత్ర‌మే. జై ల‌వ‌కుశ సినిమాలో మూడు భిన్న‌మైన పాత్ర‌లు చేసే సాహ‌సం ఇప్పుడు ఎవ్వ‌రూ చేయ‌రు.. చేయ‌లేరేమో ? అని చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్‌లో తార‌క్ ఆదిలాబాద్ మ‌న్యం వీరుడు కొమ‌రం భీం పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. కొమ‌రం భీం గోండు జాతి గిరిజ‌నుల కోసం బ్రిటీష్ వారు, నైజాంపై పోరాటం చేసిన మ‌హోన్న‌త యోధుడు.. వారి ఆరాధ్య దైవం.

చ‌రిత్ర‌లో ఈ పాత్ర‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది.. పైగా అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌కు పోటీగా న‌టించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. నిన్న రిలీజ్ అయిన ఎత్త‌ర జెండా పాట‌లో ఎన్టీఆర్ లుక్స్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్నాయి. అందులో పంచెక‌ట్టుతో ఎన్టీఆర్ క‌నిపించిన లుక్ నంద‌మూరి అభిమానుల‌ను అమితంగా ఆక‌ర్షించింది. ఒక చోట అచ్చు గుద్దిన‌ట్టు త‌న తాత ఎన్టీఆర్ లుక్‌లో క‌నిపించ‌డంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు అయితే ఎన్టీఆర్ త‌న తాత‌ను అచ్చుగుద్దిన‌ట్టే పోలీ ఉన్నాడ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news