యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ ఈ శుక్రవారం పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. రాధేశ్యామ్‌పై ఉన్న అంచనాల నేపథ్యంలో తొలి 3 రోజుల్లోనే ఏకంగా రు. 151 కోట్ల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.
అయితే రాధేశ్యామ్ కంప్లీట్ పామిస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథ కావడం.. బాహుబలి, సాహో లాంటి యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ నటింంచిన ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం ప్రభాస్ అభిమానులకే రుచించలేదు. ప్రభాస్ అభిమానుల పరిస్థితే ఇలా ఉందంటే.. ఇక సగటు సినీ అభిమానులు సైతం ఈ సినిమాను ఎంత వరకు ఎంజాయ్ చేస్తారన్నది చెప్పలేం ?
రాధేశ్యామ్ ఎంతైనా ప్రభాస్‌తో పాటు ఆయన అభిమానులను డిజప్పాయింట్ చేసింది. అయితే ప్రభాస్ లైనప్‌లో ఇప్పుడు మూడు, నాలుగు భారీ సినిమాలే ఉన్నాయి. వచ్చే యేడాది సంక్రాంతికి ఓ రౌత్ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్, సలార్ 1, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల మధ్యలోనే టాలీవుడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా రానుంది. ఫ్యామిలీ, ప్రేమ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందని అంటున్నారు.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు మాళవిక మోహనన్. ఆమె ఎవరో కాదు కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ పక్కన మాస్టర్ సినిమాలో నటించింది.
ఆమె అందచందాలకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు. పైగా ఈ సినిమాకు పాన్ ఇండియా ఇమేజ్ రావాలంటే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోయిన్లనే సెట్ చేయాల్సి ఉంటుంది. అందుకే మాళవికను ఓ హీరోయిన్‌గా తీసుకున్నారని అంటున్నారు. ఏదేమైనా తెరపై ప్రభాస్ – మాళవిక జంట రొమాన్స్ అయితే మామూలుగా ఉండదనే చెప్పాలి.