పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఖుషీ సినిమా వరకు అన్ని హిట్లే. తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి – సుస్వాగతం – తొలిప్రేమ – గోకులంతో సీత – తమ్ముడు – బద్రి – ఖుషీ ఇలా సినిమా సినిమాకు పవన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. జానీ సినిమా వరకు పవన్‌కు ప్లాప్ లేదు. అయితే పవన్‌కు తొలిప్రేమ, తమ్ముడు లాంటి హిట్లు పడి యూత్‌లో క్రేజ్ వచ్చినా పవన్‌స్టైల్‌కు యూత్ ఫిదా అయ్యి పవన్‌ను తిరుగులేని స్టార్‌ను చేసిన సినిమా మాత్రం బద్రి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ అని కౌంటర్‌గా చెప్పే డైలాగ్ అప్పటకీ.. ఇప్పటకీ ఓ సంచలనం.
తమ్ముడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్‌తో ఎలాగైనా సినిమా చేయాలని డిసైడ్ అయ్యి పవన్‌కు కోటి రూపాయల చెక్ ఇచ్చారు. పవన్ తొలిసారిగా ఓ సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా బద్రీయే కావడం విశేషం. ఇక రామ్‌గోపాల్ వర్మ, కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన పూరి జగన్నాథ్ అప్పుడే డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పేందుకు అపాయింట్‌మెంట్ సంపాదించి వెళ్లాడట.
ఓ అమ్మాయి.. అబ్బాయి ప్రేమలో ఉంటారు.. ఆ అమ్మాయి హీరోతో మరో అమ్మాయిని ప్రేమించాలన్న పందెం వేస్తుంది.. చివరకు ఈ పందెంలో వారు నిజంగానే ప్రేమించుకుంటారు.. ఈ లైన్ చెప్పిన రెండు నిమిషాలకే పవన్ క్లైమాక్స్ ఏంటని అడిగి వెంటనే ఓకే చేసేశాడట. కేవలం రెండే రెండు నిమిషాల్లో పవన్ ఈ స్టోరీ ఓకే చేయడం అప్పట్లో నిజంగానే సెన్షేషనల్. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. పూరికి బలమైన లాంచింగ్ దొరికేసింది.
కథ ఓకే అయిన వెంటనే అప్పటికే కహానా ఫ్యార్ హై సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అమీషా పటేల్‌తో పాటు బాలీవుడ్‌కే చెందిన రేణు దేశాయ్‌ను రెండో హీరోయిన్‌గా తీసుకున్నారు. సినిమా తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2000 ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. 45 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. బద్రీ కేవలం ఫస్ట్ వీక్‌లో రు 2.5 కోట్ల షేర్ రాబట్టింది.