Moviesమెగాస్టార్ చిరంజీవికి ఆ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందా...!

మెగాస్టార్ చిరంజీవికి ఆ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందా…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. చిరంజీవి వేసిన పునాది వల్లే ఈరోజు మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండు మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా కొనసాగుతున్నారు. 1980వ దశకంలో చిరంజీవి అప్పటి తరం హీరోయిన్లు అందరితోనూ కలిసి నటించారు. రాధిక – రాధా – విజయశాంతి – మాధవి – సుమలత – సుహాసిని ఇలా ఆ తరం జనరేషన్ హీరోయిన్లందరితోనూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

 

చిరంజీవి ఎంత మంది స్టార్ హీరోయిన్లతో నటించినా ఎప్పుడు కూడా ఆయనకు ఏ హీరోయిన్ తో ఎఫైర్ ఉందనే ప్రచారం జరగలేదు. అయితే ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం చిరంజీవి ఆ ట్రోలింగ్‌కు గురికావలసి వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రాధ. చిరంజీవి రాధ‌ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఓ సందర్భంలో చిరంజీవి సైతం తాను తన నలభై ఏళ్ల నట జీవితంలో ఎంత మంది హీరోయిన్లతో కలిసి నటించినా రాధతో మాత్రమే తను చాలా సార్లు పోటాపోటీగా నటన ఎదుర్కొన్నానని చెప్పారు.

డైరెక్టర్ చెప్పిన వెంటనే కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లో ఆమె షాట్‌కు రెడీ అయిపోయేదని.. ఒక్కోసారి తనకు కూడా ఐదారు నిమిషాలు టైం ప‌ట్టేదని చెప్పారు. రాధ డ్యాన్సులు కూడా చిరంజీవితో పోటాపోటీగా వేసేది. డ్యాన్సుల విష‌యంలో చిరంజీవిని కొట్టే హీరోయినే ఉండేది కాదు. కాని రాధ‌తో డ్యాన్స్ అంటే చిరంజీవి కూడా ఎంతో క‌ష్టప‌డాల్సి వ‌చ్చేద‌ట‌. వీరి జంట జంటకు అప్పట్లో తిరుగులేని డిమాండ్ ఉండేది. ఈ కారణాలతోనే వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే వారు అట.

అందుకే కొందరు చిరంజీవికి – రాధ‌కు మధ్య ఎఫైర్ ఉందనే ప్రచారం చేసేవారట. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ చెన్నైలో ఉండ‌డంతో కొన్ని త‌మిళ ప‌త్రిక‌లు కూడా ఈ వార్త‌లు ఎక్కువుగా రాసేవ‌ట‌. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే వాస్తవానికి చిరంజీవికి అలాంటి అభిప్రాయం ఏ హీరోయిన్‌పై ఉండేది కాదని… అలాంటి అభిప్రాయం ఉంటే చిరంజీవి 40 సంవత్సరాలుగా స్టార్ హీరో గా కొనసాగే వారే కాదని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news