Moviesచిరు చిన్న కూత‌రు శ్రీజ చేసిన ప‌నికి ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు...!

చిరు చిన్న కూత‌రు శ్రీజ చేసిన ప‌నికి ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు…!

ఇటీవ‌ల మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ ఎక్కువుగా సోష‌ల్ మీడియాలోనూ, మీడియాలోనూ బాగా నానుతున్నారు. శ్రీజ అంతలా వార్త‌ల్లో నాన‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ఆమె త‌న రెండో భ‌ర్త క‌ళ్యాణ్‌దేవ్ నుంచి విడాకులు తీసుకోబోతోంది అన్న వార్తే. శ్రీజ చిరుకు రెండో కుమార్తె.. శ్రీజ చిన్న అమ్మాయి కావ‌డంతో ఆమె అంటే చిరు దంప‌తుల‌కు ఎంతో ఇష్టం. అయితే చిరు రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ముందే.. ఆ చ‌ర్చ‌లు న‌డుస్తుండ‌గా ఆమె శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే ఫ్రెండ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి చిరు ఇంట్లో వాళ్ల‌కు చెప్ప‌కుండానే సీక్రెట్‌గా చేసుకోవ‌డం.. అది పెద్ద ర‌చ్చ కావ‌డం తెలిసిందే.

ఆ త‌ర్వాత శిరీష్‌తో క‌లిసి కొద్ది రోజుల పాటు ఢిల్లీలో ఉంది. త‌ర్వాత హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఓ పాప పుట్టాక భ‌ర్త‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయి తిరిగి చిరు ఇంటికి వ‌చ్చేసింది. త‌ర్వాత ఆమెకు మ‌ళ్లీ పెళ్లి చేశారు.ఈ సారి చిత్తూరు జిల్లా మూలాలు ఉన్న క‌ళ్యాణ్‌దేవ్‌తో చిరు దంప‌తులు శిరీష్‌కు మ‌ళ్లీ పెళ్లి చేశారు. క‌ళ్యాణ్‌దేవ్ ఫ్యామిలీతో చిరు కుటుంబానికి ఉన్న స్నేహం నేప‌థ్యంలో ఈ పెళ్లి కుదిరింది.

ఈ దంప‌తుల‌కు కూడా ఓ పాప పుట్టాక ఏం జ‌రిగిందో కాని.. మ‌ళ్లీ వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌న్న ప్ర‌చార‌మే జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం బాగా జ‌రుగుతున్నా కూడా అటు క‌ళ్యాణ్ కూడా ఇటు శ్రీజ కాని స్పందించ‌డం లేదు. పైగా వీరు విడివిడిగానే ఉంటున్నారు. శ్రీజ శ్రీజ క‌ళ్యాణ్ పేరు తీసేసి శ్రీజ కొణిదెల అని పెట్టుకుంది. పైగా క‌ళ్యాణ్ భార్య‌కు దూరంగా అమెరికాలో ఉంటున్నారు.. లేదా హైద‌రాబాద్ వ‌చ్చినా ఆమె ద‌గ్గ‌ర‌కే వెళ్ల‌డం లేద‌న్న‌ది నిజం.

స‌మంత – చైతు విడాకుల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే వీరు కూడా విడాకులు తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రిగింది. సంక్రాంతికి వ‌చ్చిన క‌ళ్యాణ్ సూప‌ర్ మ‌చ్చి సినిమాను కూడా మెగా కాంపౌండ్ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.. బాగా లైట్ తీస్కొంది. ఏదేమైనా ఈ సంఘ‌ట‌న‌లు చూస్తుంటే క‌ళ్యాణ్ – శ్రీజ మాన‌సికంగా విడిపోవ‌డానికి సిద్ధ‌మైన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

ఇటు మెగా అభిమానులు కూడా శ్రీజ విడాకుల మ్యాట‌ర్‌తో ఆందోళ‌న‌తోనే ఉన్నారు. చిరు పెద్ద కుమార్తె ఇప్ప‌టికే భ‌ర్త‌కు దూరంగా ఉంటోంది. దాదాపు విడాకులు అయిన‌ట్టే అంటున్నారు. అటు శ్రీజ మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసింది. ఇప్పుడు రెండో భ‌ర్త విష‌యంలోనూ అదే జ‌రుగుతూ ఉండ‌డంతో చిరు సైతం ఆందోళ‌న‌తోనే ఉన్నార‌ని మెగా వ‌ర్గాలు చెపుతున్నాయి. ఈ వ‌య‌స్సులో చిరంజీవి వ‌రుస‌పెట్టి జోరు చూపిస్తూ సినిమాలు చేస్తున్నా త‌న ఇద్ద‌రు కుమార్తెల విష‌యంలోనే బాగా టెన్ష‌న్‌తో ఉంటున్నార‌ట‌.

ఇక నెటిజ‌న్లు కూడా శ్రీజ స‌ర్దుకుపోకుండా ఇలా లేనిపోని పుకార్ల‌కు కార‌ణ‌మ‌వుతూ ఉండ‌డంతో నెటిజ‌న్లు, మెగా అభిమానులు కూడా సోష‌ల్ మీడియాలో ఆమెను విమ‌ర్శిస్తున్నారు. ఓ సారి ఆమె తండ్రి మాట విన‌కుండా పెద్ద త‌ప్పు చేసి ఇబ్బంది ప‌డింద‌ని.. ఇప్పుడు కూడా ఆమె దూకుడుగానే, సొంత నిర్ణ‌యాల‌తో వెళుతూ త‌న జీవితాన్ని స్పాయిల్ చేసుకోవ‌డంతో పాటు అటు త‌న తండ్రిని కూడా ఇబ్బంది పెడుతుంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి శ్రీజ ఏం చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news