పాన్ ఇండియా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తోన్న R R R సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోన్న కొద్ది టెన్షన్ పెరుగుతోంది. ఓ వైపు బాహుబలి 2 తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడం.. అటు టాలీవుడ్‌లోనే మోస్ట్ క్రేజీ స్టార్స్‌గా ఉన్న రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా కావడం.. తెలుగు గడ్డపై చరిత్రలో నిలిచిపోయిన పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై మామూలు అంచనాలు లేవు.
ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్లకు ఓవర్సీస్‌లో అలా బుకింగ్‌లు స్టార్ట్ అయ్యాయో లేదో ఏకంగా మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చేశాయి. రిలీజ్‌కు మరో 15 రోజుల టైం ఉంది.. ఈ లోగా ఈ ప్రీమియర్ బుకింగ్‌లే 2 లేదా 3 మిలియన్ డాలర్లను దాటేస్తాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. సహజంగానే పెద్ద సినిమాలకు ఓవర్సీస్‌లో యూఎస్‌లో ప్రీమియర్ షోలు వేస్తారు. ఇండియాలో రిలీజ్‌కు ముందు రోజు అర్ధరాత్రి నుంచే అక్కడ షోలు స్టార్ట్ అవుతాయి.. హంగామా ఉంటుంది.
ఇక త్రిబుల్ ఆర్‌ను కూడా అక్కడ 1000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అందుకు తగినట్టుగానే ప్రీమియర్లు వేస్తున్నారు. ఎంత లేదన్నా 25వ తేదీ ఉదయం 4 గంటల నుంచే ఇండియాలో షోలు స్టార్ట్ అయినా కూడా ముందు షో ఓవర్సీస్‌లోనే పడుతుంది. అయితే త్రిబుల్ ఆర్ షో ఈ సారి ఫస్ట్ ఇండియాలోనే వేసేలా ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందు రోజు మార్చి 24న ఈ సినిమా రిలీజ్ అయ్యే అన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.
అంటే 24వ తేదీ సెకండ్ షో ఏపీ, తెలంగాణలో ఆల్‌మోస్ట్ అన్ని థియేటర్లు, స్క్రీన్లలో వేసే ప్లానింగ్ జరుగుతోంది. గతంలో బాహుబలి 2 సినిమాకు హైదరాబాద్‌లో కొన్ని ఎంపిక చేసిన మల్టీఫ్లెక్స్‌లు, థియేటర్లలో ముందు రోజు సెకండ్ షో వేశారు. మామూలుగా 24వ తేదీ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి ప్రీమియర్లు వేస్తూ ఉంటారు.
అయితే ఈ సారి అలా కాకుండా ముందు రోజు సెకండ్ షో నుంచే త్రిబుల్ ఆర్ షోల పరంపర స్టార్ట్ అవుతుంది. 24వ తేదీ అర్ధరాత్రికే త్రిబుల్ ఆర్ రిజల్ట్ ఏంటనేది తెలుగు గడ్డపై ఆల్‌మోస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇక ఎన్టీఆర్, చరణ్ అభిమానుల రచ్చ ఒక రోజు ముందు నుంచే షురూ కానుంది.