MoviesR R R ప్ర‌మోష‌న్ల‌కు ఆలియా డుమ్మా... రాజ‌మౌళియే దూరం పెట్టేశాడా...!

R R R ప్ర‌మోష‌న్ల‌కు ఆలియా డుమ్మా… రాజ‌మౌళియే దూరం పెట్టేశాడా…!

త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్ల జాత‌ర మ‌రోసారి షురూ అయ్యింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాక‌.. నెల రోజుల ముందు నుంచే భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు చేశారు. అప్పుడు మెట్రో న‌గ‌రాల్లో భారీ ఈవెంట్ల‌తో పాటు ఓవ‌రాల్‌గా రు. 20 కోట్లు ప్ర‌మోష‌న్ల‌కు ఖర్చు పెట్టారు. క‌ట్ చేస్తే ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో పాటు మ‌రో వైపు ఏపీలో టిక్కెట్ రేట్లు మ‌రీ త‌క్కువుగా ఉండ‌డంతో రిస్క్ చేయ‌లేకోయారు. రాజ‌మౌళి కూడా సినిమాపై రు. 500 కోట్ల బ‌డ్జెట్ పెట్టి ఉండ‌డంతో ఆ టైంలో రిలీజ్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు.

ఇక ఇప్పుడు మార్చి 25న ఈ సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకు వ‌స్తున్నారు. సినిమా రిలీజ్‌కు 16 రోజుల టైం ఉంది. ప్ర‌మోష‌న్ల హంగామా న‌డుస్తోంది. అయితే మొన్న సంక్రాంతికి ముందు చేసినంత ప్ర‌మోష‌న్లు అయితే న‌డ‌వ‌డం లేదు. ఇప్పుడు ఈ ప్ర‌మోష‌న్ల‌ను మ‌రింత స్పీడ‌ప్ చేసే బాధ్య‌త రాజ‌మౌళి తీసుకున్నాడు. అయితే ఈ సారి ప్ర‌మోష‌న్ల‌కు మాత్రం ఆలియా భ‌ట్ రావ‌డం లేదు. రాజ‌మౌళి కూడా ఆమెను ర‌ప్పించే విష‌యంలో లైట్ తీస్కొన్నాడ‌ట‌.

ఇందుకు ఆమె మ‌రీ కాస్ట్‌లీ అయిపోవ‌డ‌మే కార‌ణం అంటున్నారు. ఇప్పుడు ఆమె బిజీగా ఉంది. కాదు కూడ‌దు ప్ర‌మోష‌న్ల‌కు రావాల‌ని ప‌ట్టుబ‌డితే ఆమె ఖ‌ర్చులు త‌డిసి మోపెడు అవుతాయ‌ట‌. అందుకే రాజ‌మౌళి కూడా లైట్ తీస్కొన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆమె ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు మొన్న 15 రోజులు ఇచ్చింద‌ట‌. ఈ 15 రోజుల్లోనే ఆమె ఖ‌ర్చు రు. 3 కోట్లు దాటేసింద‌ట‌. మ‌రో రు. 50 ల‌క్ష‌లు కూడా అద‌నంగానే అయ్యాయంటున్నారు.

ఆలియాతో పాటు ఆమె స్టాఫ్‌కు ప్ర‌త్యేక విమానాలు.. హోట‌ల్ రూమ్‌లు, కాస్ట్‌లీ ఫుడ్ ఇవ‌న్నీ క‌లిపితే రు. 3 కోట్ల పై మాటే నిర్మాత చేతి చ‌మురు వ‌దిలింద‌ట‌. మ‌రోసారి ఇప్పుడు ఆమెను ర‌ప్పిస్తే మ‌ళ్లీ రు. 3 కోట్లు వ‌దిలించుకోవాల్సిందే అంటున్నారు. నిర్మాత‌పై ఈ భారం వేయ‌డం ఇష్టం లేకే రాజ‌మౌళి ఆలియాను ఈ సారి ప్ర‌మోష‌న్ల‌కు పిలిచే విష‌యంలో పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేద‌ని అంటున్నారు. మ‌హా అయితే ముంబైలో జ‌రిగే ఈవెంట్లో మాత్ర‌మే ఆలియా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news