పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భీమ్లానాయక్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించిన ఈ భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు రెండేళ్లుగా ఊరించి ఊరించి ఎట్టకేలకు రిలీజైన ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరీ సరికొత్త రికార్డ్ నెల్కోల్పింది. ఇక నైజాంలో తొలి రోజు వసూళ్లలో భీమ్లానాయక్ దుమ్ము రేపేసింది. తొలి రోజు ఈ సినిమా ఏకంగా రు 11.80 కోట్ల షేర్ రాట్టింది. ఇది నైజాంలో ఆల్ టైం ఫస్ట్ డే షేర్‌గా రికార్డులకు ఎక్కింది.
ఇక ఈ సినిమా కి మెయిన్ ప్లస్ పాయింట్ మాటల మాత్రికుడు డైలాగ్స్..పరోక్షంగా తూటాలు దింపిన్నట్లు..దెబ్బ నొప్పి తెలిసేలా కొడుతూనే .కొట్టకుండా వదిలేసిన్నట్లు ప్రతి డైలాగ్ బాగా రాశాడు అంటున్నారు అభిమానులు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా మాటలు రాయడమే కాదు.. రావు రమేష్ లాంటి కారెక్టర్ ఆర్టిస్టులకు కూడా గుర్తుండిపోయే డైలాగులు రాసాడు మాటల మాంత్రికుడు. మల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్యప్పనుం కోషియమ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో ప్రతి ఫైట్ సీన్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా పవన్ ..రానా ఇంటికి వెళ్ళి కొట్టే సీన్ ఫైట్ అయితే ధియేటర్స్ లో విజిల్స్ మొగుతున్నాయి.
అయితే, మీరు సినిమా చూసిన్నప్పుడు గమనించిన్నట్లైతే..పవన్ కళ్యాన్ రానాని చెయ్యి వెనక్కి తిప్పి..రానా భుజం పై పవన్ కాళ్లుని గట్టిగా నొక్కి పెట్టుకుంటాడు..ఆ సీన్ గుర్తువచ్చిందా..హా..సినిమా కే హైలెట్ గా నిలిచిన ఈ సీన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సేమ్ టూ సేమ్ అలానే రామాయణంలోని సీన్ ఇలాగే ఉంటుంది. రామాయణంలో వాలి, సుగ్రీవులు అన్నదమ్ములే అయినా కానీ విరోధులుగా ఉంటారు.
ఇక వాలి బలవంతుడు కావడంతో సుగ్రీవుడు ఎలాగోలా రాజ్యం నుంచి తప్పించుకుని ..అడవుల్లో ఉంటున్నప్పుడు రాముడితో స్నేహం కుదిరి..ఆయన సాయంతోనే సుగ్రీవుడు ..వాలిపై యుద్ధానికి దిగుతాడు. ఇక ఆ టైంలో హనుమంతుడు శత్రు సంహారం చేసే సమయంలో భీమావతారం ఎత్తి సంహరించిన తీరును ఈ సినిమాలో ‘భీమ్లా పట్టు’గా పవన్ పాత్రకు రూపొందించినట్లు ఈ పై చిత్రం చూస్తే తెలుస్తుంది. కాగా ఈ సినిమా విడుదల అయ్యి ఐదు రోజులు అవుతున్న బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం కలెక్షన్లు తగ్గకుండా దూసుకుపోతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరోసారి ఈ సినిమా ద్వారా తన గర్జన వినిపించారు.