Moviesపూజాకు అంత తలపొగరా.. మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..?

పూజాకు అంత తలపొగరా.. మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , అందాల పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్త నిర్మాణంలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. దీంతో సినిమా పై అభిమానులు మరింత అంచానాలను పెట్టుకునేశారు. సాహో చిత్రం తర్వాత ప్రభాస్‌ మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. వరుస ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉన్నా థియేటర్‌లో ఒక్క సినిమా లేకపోయే సరికి డార్లింగ్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే వీరి ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ రాధేశ్యామ్‌ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన రాధే శ్యామ్ 1960వ ద‌శ‌కంలో యూర‌ప్‌లో ఇటలీలో జ‌రిగిన ఓ య‌దార్థ ప్రేమ క‌థ ఆథారంగా తెర‌కెక్కుతోంది. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ విలక్షణ కథా చిత్రం గత కొంత కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు మార్చి 11న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుధవారం నాడు ముంబైలో ఈ సినిమా నుంచి మరో కొత్త ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రెస్‌మీట్‌లో ప్రభాస్, పూజా పాల్గోన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా…అక్కడ వాళ్ళు ప్రవర్తించిన తీరు అభిమానులకు కోపం తెప్పిస్తుంది.

ప్రెస్ మీట్ లో పూజా ..ప్రభాస్ తో సరిగ్గ మాట్లాడకపోవడం ..ఆయన పక్కన ఉన్న ప్రభాస్ ని నెగ్లెట్ చేస్తూ వేరే వాళ్ళతో మాట్లాడటం..ఆయన మీడియా అడుగుతున్న ప్రశ్నలకి సమాధానలు చెప్పుతున్నప్పుడు పూజా మరెక్కడో చూస్తుండడం..ఇలా ఒకటి కాదు రెండూ కాదు అన్నీ విషయాలల్లో పూజా ప్రభాస్ ను అవమానించిన్నట్లే అనిపించిందని అభిమానులు వాపోతున్నారు. ఇక మనందరికి తెలిసిన విషయమే ఈ సినిమా షూటింగ్ టైంలో నే వీళ్ల మధ్య ఏదో గొడవ జరిగిందని..అప్పటినుండి వీళ్ళు ఎడముఖం పెడ ముఖంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అసలు ఆ గొడవలు కారణంగానే పూజా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనని చెప్పిందట.

కానీ మేకర్స్ అగ్రిమెంట్ విషయాని గుర్తుచేసి మరీ బలవంతంగా ప్రమోషన్స్ చేయిస్తున్నారట. అయితే అభిమానులు మాత్రం ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. బ్యాక్ ఎన్ని గొడవలు జరిగినా కెమారా ముందు అవి చూయించకూడదు అనే విషయం పూజా కు తెలియదా..అంత తలపొగరా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక పూజా పరిస్ధితి ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news