Moviesఇంత పెద్ద ఆఫర్ నా..జాక్ పాట్ కొట్టేసిన నయన్ ప్రియుడు..లక్ అంటే...

ఇంత పెద్ద ఆఫర్ నా..జాక్ పాట్ కొట్టేసిన నయన్ ప్రియుడు..లక్ అంటే ఇదేరా !!

న‌య‌న‌తార-విఘ్నేశ్ శివ‌న్.. కోలీవుడ్ ల‌వ్ లీ క‌పుల్ అంటూ బిరుదు కొట్టేశారు. ఇండస్ట్రీలో హాట్ రొమాంటిక్ కపుల్స్ ఎవ‌రంటే ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించకుండా అందరు టకున్న చెప్పే పేరు న‌య‌న‌తార-విఘ్నేశ్ శివ‌న్. వీళ్లకి పెళ్లి మాత్రమే కాలేదు..మిగతా అన్ని జరిగిపోతున్నాయని అంటున్నారు నెటిజన్స్. కొంత‌కాలంగా ప్రేమాయ‌ణంలో ఉన్న ఈ జంట ఇదిగో పెళ్లి చేసుకుంటాం అదిగో పెళ్లి చేసుకుంటాం అంటూ కాలం సాగదీస్తున్నారే తప్పిస్తే..ఆ మూడు ముళ్లు వేసుకుని ఆ ముచ్చట తీర్చుకోవడంలేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట ఎప్పుడైనా పెళ్లి పీట‌లెక్కే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ క్రేజీ క‌పుల్ పెళ్లి కాకుండానే ఒక్కే ఇంట్లో ఉంటున్నారన్న వార్తలు వైరల్ గా మారాయి.

కాగా, రీసెంట్ గానే చెన్నై లో ఓ గుడికి వెల్లిన ఈ జంట అక్కడ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చార్యానికి గురిచేసింది. నయన్ నుదిట పై కుంకుమ పెట్టుకుని..అచ్చం పెళ్ళైన స్త్రీలా నే తిరుగుతుంది. దీంతో ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి కూడా చేసుకునేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా, రీసెంట్ గా నయన్ ప్రియుడు క్రేజీ ఆఫర్ ను పట్టేశాడు. దీతో మాటల్లో చెప్పలేని ఆనందం అంటూ తన ఫీలింగ్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తలా అజిత్‌తో తన కొత్త సినిమా ఉండబోతోందని విఘ్నేశ్ ప్రకటించాడు. ఈ సినిమాను లైకా సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ 62 వ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్‌కరణ్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను ఈ యేడాది చివర్లో మొదలై.. వచ్చే యేడాది మధ్యలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. ఇక గతంలో అజిత్, నయన్ కాంబినేషన్ లో వచ్చిన ‘బిల్లా , ఆగన్, ఆరంభం, విశ్వాసం’ చిత్రాలు సూపర్ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్‌ లో కూడా నయన్ నే హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయింది. అలా పెళ్లికి ముందే భర్తకు లక్ ను తీసుకొస్తుంది నయన్ బ్యూటి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news