Moviesమ‌హేష్ స‌ర్కారు వారి పాట‌కు కీర్తి సురేష్ దెబ్బేసేసిందే..!

మ‌హేష్ స‌ర్కారు వారి పాట‌కు కీర్తి సురేష్ దెబ్బేసేసిందే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు ప‌ర‌శురాం ద‌ర్శ‌కుడు. మే 12న రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీస్‌, 14 రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్టైన్‌మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మ‌హేష్ ప‌క్క‌న హీరోయిన్‌గా కీర్తిసురేష్ న‌టిస్తుంద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే మ‌హేష్ అభిమానులు మాత్ర‌మే కాకుండా తెలుగు సినీ ల‌వ‌ర్స్ కూడా షాక్ అయ్యారు.

కార‌ణం ఏంటో తెలియ‌దు కాని.. ఇటీవ‌ల కీర్తి సురేష్ క్రేజ్ బాగా డౌన్ అవుతూ వ‌స్తోంది. ఇప్పుడు అంతా పూజా హెగ్డే, ర‌ష్మిక మానియాయే న‌డుస్తోంది. ఇక కీర్తి సురేష్ ఇటీవ‌ల చేసిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఆమె రేంజ్‌ను బాగా త‌గ్గించేశాయి. దీనికి తోడు ఆమె చేసిన వెబ్‌సీరిస్‌లు క్లిక్ కాలేదు. తాజాగా ఆమె మ్యూజిక్ ఆల్బ‌మ్ గాంధారిలో న‌టించింది. ఈ మ్యూజిక్ వీడియో ఇటీవ‌లే రిలీజ్ చేశారు. ఈ పాట చూసిన వారంతా కీర్తి కెరీర్ ఎండింగ్ స్టేజ్‌కు వ‌చ్చేసింద‌న్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లు ఈ సాంగ్‌ను కూడా ఆమె రేంజ్‌కు త‌గ్గ‌ట్టుగా ఏ మాత్రం క్వాలిటీగా షూట్ చేయ‌లేద‌నే అంటున్నారు. విజువ‌ల్ ప‌రంగాను, టేకింగ్ ప‌రంగాను చాలా పూర్‌గా ఉంది. కీర్తి అన‌వ‌స‌రంగా ఇలాంటివి చేసి ఆమె స్థాయిని బాగా త‌గ్గించేసుకుంటోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ఎఫెక్ట్ రేపు స‌ర్కారు వారి పాట మీద కూడా ప‌డుతుంద‌న్న ఆందోళ‌న మ‌హేష్ అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఓ స్టార్ హీరోతో ఆమె సినిమా చేస్తున్న‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఆమె ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా ఆ ఎఫెక్ట్ ఆ సినిమాపై ప‌డ‌డంతో పాటు ఆమె కెరీర్ పై కూడా ప‌డుతుంది. త‌న రేంజ్‌, క్రేజ్ అలా మెయింటైన్ చేస్తే స్టార్ హీరో సినిమా హిట్ అయితే ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ కీర్తి చిన్న చిన్న ఛాన్సుల కోసం పెద్ద హీరోల సినిమాల‌ను లైట్ తీస్కొంటూ ఆమె త‌నంత‌ట తానే త‌న క్రేజ్ త‌గ్గించుకుంటోన్న ప‌రిస్థితి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news