అక్కినేని కుటుంబం.. టాలీవుడ్ పెద్ద కుటుంబాల్లో ఒకటి. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లు ఉంటే అందులో ఒకటి ఎన్టీఆర్ అయితే.. రెండో కన్ను ఏఎన్నారే. ఆయన ఓ లెజెండ్. నాన్ కాంట్రవర్సీయల్ పర్సన్. సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంలో ఏఎన్నార్ ఎంతో కృషి చేశారు. ఆయన నట వారసుడిగా వచ్చాడు నాగార్జున. అమ్మాయిల కలల రాకుమారుడే..!
ఆ తరం నుంచి.. ఈ తరం వరకు నాగార్జునకు తిరుగులేని రొమాంటిక్ ఇమేజ్ ఉంది. ఇక నాగార్జున ఇద్దరు వారసులు కూడా సినిమాల్లోకి వచ్చి నిలదొక్కుకున్నారు. చైతు తానేంటో ఇప్పటికే ఫ్రూవ్ చేసుకున్నాడు. అఖిల్‌కు బ్యాచిలర్‌తో ఎట్టకేలకు హిట్ పడింది. ఇప్పుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చేస్తున్నాడు. ఇలా ట్రాక్ పరంగా ఈ ఫ్యామిలీకి మూడో తరంలోనూ తిరుగులేని రికార్డ్ ఉంది. అయితే పెళ్లి.. అందులోనూ తొలి పెళ్లి అనేది ఈ ఫ్యామిలీని ఎందుకో వెంటాడుతోంది.
అక్కినేని ఫ్యామిలీలో ఎవ్వరికి వైవాహిక బంధం కలిసి వచ్చినట్టుగా లేదు. నాగార్జున మొదటి వివాహం దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మితో జరిగింది. నాగచైతన్య పుట్టాక వీరి మధ్య స్పర్థలు రావడంతో విడిపోయారు. అసలు ఏఎన్నార్ – రామానాయుడు వియ్యంకుల్లు అయ్యారంటే అప్పట్లో ఇండస్ట్రీ అంతా గొప్పగా ఫీలయ్యారు. రెండు దిగ్గజ కుటుంబాల మధ్య బంధుత్వం ఓ సంచలనం అయ్యింది. కానీ వీరు విడిపోయారు.
ఆ తర్వాత నాగార్జున తన తోటి హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక నాగార్జునకే కాదు.. ఆయన ఇద్దరు కుమారులకు కూడా పెళ్లి బంధం కలిసి రాలేదు. పెద్ద కుమారుడు చైతన్య – సమంత పెళ్లి కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్ల మధ్య జరిగింది. అక్కినేని ఇంటికి ఓ స్టార్ హీరోయిన్ కోడలిగా వస్తోందంటూ ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్‌గా మారింది. అయితే నాలుగేళ్లకే వీరు విడిపోయారు.
ఇక అఖిల్‌ది మరో గాథ. పెళ్లి కాకముందే ఎంగేజ్మెంట్ అయ్యాక తన ప్రేయసి శ్రీయాభూపాల్కు దూరమయ్యాడు. ఇది కేవలం నాగార్జున కుటుంబానికే పరిమితం కాలేదు. అక్కినేని ఫ్యామిలీకే చెందిన మరో హీరో సుమంత్, హీరోయిన్ అయిన సుమంత్ సోదరి సుప్రియ విషయంలోనూ జరిగింది. అప్పట్లో టాప్ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమవివాహం చేసుకున్న సుమంత్ యేడాదికే విడిపోవాల్సి వచ్చింది. కీర్తిరెడ్డి మరో పెళ్లి చేసుకున్నా సుమంత్ ఇంకా అలాగే ఉండిపోయాడు.
ఇక సుమంత్ సోదరి యార్లగడ్డ సుప్రియ సైతం ఇష్టం హీరో చరణ్‌రెడ్డిని ప్రేమవివాహం చేసుకుంది. ఆ తర్వాత చరణ్ చెడుఅలవాట్లతో అతడికి దూరమైంది. ఆ తర్వాత చరణ్ అనారోగ్యంతో చనిపోయాడు. సుప్రియ ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. ఏదేమైనా టాలీవుడ్ లో బ్రేకప్స్ ఎక్కువగానే ఉన్నా అక్కినేని కుటుంబంలో అవి మరీ ఎక్కువుగా ఉండడంతో ఇది రాబోయే తరాలతో పాటు వీరి కెరీర్‌పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.