గత మూడు దశాబ్దాల కాలంలో తమిళ సినిమా ఇండస్ట్రీని చాలా మంది ఏలేశారు. కొందరు అయితే రెండు మూడు దశాబ్దాలుగా ఎందరో స్టార్ హీరోలు వచ్చినా కూడా తమ సత్తా చాటుతూనే ఉన్నారు. మరి కొందరు మాత్రం కుర్ర హీరోల పోటీకి తట్టుకోలేక ఇండస్ట్రీకే దూరమవుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం కోలీవుడ్‌లోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలుగా అజిత్ – అరవింద స్వామి – అబ్బాస్ ఉండేవారు. వీరు అప్పట్లో పోటీ పడి మరీ నటించేవారు.
వీరిలో అజిత్ ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. అజిత్ సినిమా వస్తుందంటే అసలు సౌత్‌తో పాటు అటు బాలీవుడ్ కూడా ఊగిపోతూ ఉంటుంది. ఇక సీనియర్ హీరో అరవింద్ స్వామి రోజా సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయన హీరోగా కాస్త ఫేడవుట్ అయినా కీలక పాత్రలు, విలన్ పాత్రలు చేసుకుంటూ తాను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానని ఫ్రూవ్ చేసుకుంటూ ఉన్నారు.
ఇక మరో హీరో అబ్బాస్ 1996లో వచ్చిన కాదల్ దేశం ( తెలుగులో ప్రేమదేశం) సినిమాతో ఒక్కసారిగా తిరుగులేని హీరో అయిపోయాడు. హ్యాండ్సమ్ లుక్‌తో యూత్‌లో మాంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో కూడా ఒకటీ అరా సినిమాలు చేసినా ఒక్కసారిగా కనుమరుగు అయిపోయాడు. ప్రేమదేశం సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో అబ్బాస్‌కు ఇక్కడా మంచి క్రేజ్ వచ్చింది.
అబ్బాస్ హెయిర్‌స్టైల్ చూసి అమ్మాయిలు కూడా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తెలుగులో రాజహంస – శ్వేతనాగు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగు సినిమా ఆపేసి కన్నడ, మళయాళ, తమిళ సినిమాలు చేశాడు. ఆ తర్వాత పూర్తిగా సినిమాలు వదిలేసి న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అక్కడ కొంత కాలం పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ జీవనం సాగించాడు. ఆ తర్వాత కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వెళ్లిపోయాడు.
ఆ ఫీల్డ్‌లో అనుభవం రావడంతో ఇప్పుడు పూర్తిగా కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో కొనసాగుతున్నాడట. వివిధ భాషల్లో 50కు పైగా సినిమాలు చేయడంతో పాటు యూత్‌లో మాంచి క్రేజ్ ఉన్న అబ్బాస్ ఒక్కసారిగా సినిమాలు ఎందుకు వదిలేసి పెట్రోల్ బంక్‌లో పనిచేశాడు అన్నది అర్థం కాని ప్రశ్న.