Moviesకుదిరితే అనుభవించండి లేదంటే..అయ్య బాబోయ్.. సామ్ ఏంటి ఇలా అనేసింది..?

కుదిరితే అనుభవించండి లేదంటే..అయ్య బాబోయ్.. సామ్ ఏంటి ఇలా అనేసింది..?

సమంత హీరోయిన్ గా అడుగు పెట్టిన అతి తక్కువ టైంలోనే..ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. వచ్చిన అవకాసాలను ఉపయోగించుకుంటూ..ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఫైనల్ గా టాలీవుడ్ నెం 1 హీరోయిన్ గా కొనసాగుతూన్న టైంలోనే టాలీవుడ్ వన్ ఆఫ్ ది బడా ఫ్యామిలీ అయినా అక్కినేని ఇంట కోడలు గా అడుగు పెట్టి..జీవితంలో మరో మెట్టు పైకి ఎక్కింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. అక్కినేని నాగచైతన్య కు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడి..అక్కినేని ఇంటికి మాజీ కోడలు పిల్ల అయ్యింది.

అయితే విడాకుల తరువాత ఎవరి దారి వారిది అన్నట్లు బీ హేవ్ చేస్తున్నారు సమంత చైతన్య. చై తన సినిమాల విషయంలో బిజీ గా ఉంటుంటే..సామ్ వరుస సినిమాలకు కమిట్ అవుతూనే ..మరో వైపు తనకు నచ్చిన చోట్లకి వెళ్తూ..ప్రశాంతతని వెతుకుంటుంది. విడాకుల తరువాత సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్న సమంత రీసెంట్ గా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. జీవితాని అనుభవించండి అంటూ లెక్చర్ ఇస్తూ..ఓ పోస్ట్ చేసింది.

అవుట్ డోర్ షూటింగ్ కోసం వెళ్లిన సామ్ వాటర్ ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీదియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె రెడ్ టాప్‌లో చాలా అందంగా కనిపిస్తుంది. ఇక అక్కడ నేచర్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” జీవితం .. మీరు దానిని ఎంజాయ్ చేయండి లేదా అది వచ్చినప్పుడు భరించండి..పోతున్నప్పుడు, అది ఎగసిపడుతున్నప్పుడు మరియు ప్రవహిస్తున్నప్పుడు సహించండి.” అంటూ డీప్ ఫీలింగ్స్ తో రాసుకొచ్చింది. దీంతో అమ్మడు మనకు ఏదో చెప్పాలి అనుకుని అది చెప్పలేక మరేదో చెప్తుంది అంటూ నెటిజన్స్ రీవర్స్ కౌంటర్ లు వేస్తున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత వరుస సినిమాలతో బిజీ గా ఉంది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news