Moviesసినిమా ఛాన్స్ కోసం హీరోయిన్లే క‌మిట్ అవుతున్నారా... హీరోయిన్ సంచ‌ల‌నం..!

సినిమా ఛాన్స్ కోసం హీరోయిన్లే క‌మిట్ అవుతున్నారా… హీరోయిన్ సంచ‌ల‌నం..!

సునీల్ హీరోగా సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నిర్మించిన సినిమా భీమ‌వ‌రం బుల్లోడు. ఈ సినిమా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. అయితే సునీల్ ప‌క్క‌న హీరోయిన్‌గా చేసిన ఎస్తేర్ నోరోన్హ మాత్రం బాగా పాపుల‌ర్ అయ్యింది. ఎస్తేర్ న‌ట‌న‌తో పాటు అందం, గ్లామ‌ర్ డోస్ యూత్‌కు కిక్ ఇచ్చాయి. ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఆమెకు అనుకున్న స్తాయిలో అవ‌కాశాలు రాలేదు. ఆ త‌ర్వాత గ‌రం సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది. ఆ త‌ర్వాత బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌య‌జాన‌కి నాయ‌క సినిమాలో చిన్న పాత్ర‌లో మెరిసింది. ఆ త‌ర్వాత ఆమెకు టాలీవుడ్‌లో పెద్ద‌గా అవ‌కాశాలు అయితే రాలేదు.

ఆ త‌ర్వాత పాపుల‌ర్ సింగ‌ర్ నోయ‌ల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. స‌డెన్‌గా ప్రేమించుకుని.. వీరిద్ద‌రు పెళ్లి ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఇండ‌స్ట్రీ అంతా షాక్ అయ్యింది. ఈ సింగ‌ర్‌కు, హీరోయిన్ ఎస్తేర్‌కు ఎక్క‌డ లింక్ కుదిరింద‌బ్బా ? అని ఆశ్చ‌ర్య‌పోయారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి లాంటి దిగ్గ‌జాలు కూడా ఈ పెళ్లికి హాజ‌ర‌య్యారు. అయితే ఆరు నెల‌లకే వీరు విడిపోయి పెద్ద షాక్ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆమెకు అస్స‌లు అవ‌కాశాలు రాలేదు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ఎస్తేర్ త‌న‌కు తెలుగులో ఎందుకు అవ‌కాశాలు రాలేదో ? చెప్పింది. ఇక్క‌డ ఆఫ‌ర్లు రావాలంటే క‌మిట్‌మెంట్లు ముఖ్యం అని.. వాటికి ఒప్పుకోక‌పోతే ఇక్క‌డ కెరీర్ ముగిసిపోతుంద‌ని బాంబు పేల్చింది. తాను కూడా ఇక్క‌డ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాన‌ని.. వాళ్లు ఇన్‌డైరెక్టుగా అర్థం అయ్యేలా చెపుతార‌ని.. అందుకు ఒప్పుకోక‌పోతే నీ కంటే వెన‌క వ‌చ్చిన‌వాళ్లు కూడా నీ కంటే ముందుకు వెళ్లిపోతార‌ని .. నువ్వు మాట విన‌క‌పోతే ఇక్క‌డే ఉండిపోతావ‌ని… గ‌తంలో చాలా మందికి ఇలాగే జ‌రిగింద‌ని బెదిరిస్తార‌ని చెప్పింది.

తెలుగులో ఓ కుర్ర హీరో సినిమా విష‌యంలో కూడా తాను అనుభ‌వం ఎదుర్కొన్నాన‌ని ప‌రోక్షంగా చెప్పింది. ఇక త‌న‌కు సినిమా అంటే ఇష్టం అని.. అయితే అదే నా జీవితం కాద‌ని.. సినిమా ఛాన్సుల కోసం తాను అంత‌గా దిగ‌జారాల్సిన అవ‌స‌రం లేద‌ని ఎస్తేర్ చెప్పింది. అయితే ఆ వెంట‌నే త‌న‌కు క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీలో మంచి అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని తెలిపింది. ఇక కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చెపుతూ ఇక్క‌డ వాళ్లు అడ‌గ‌క పోయినా.. స్వ‌యంగా ఆఫ‌ర్ చేసే వాళ్లు కూడా ఉన్నార‌ని ఆమె చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news