Moviesఆయన వల్లనే నాగార్జున కొన్ని వేల కోట్లు కూడబెట్టుకున్నారట..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న...

ఆయన వల్లనే నాగార్జున కొన్ని వేల కోట్లు కూడబెట్టుకున్నారట..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. అలాంటి మార్క్ ను క్రియేట్ చేశారు లెజండరి నటుడు అక్కినేని నాగేశ్వర రావు. ఇప్పుడు నాగారజున కానీ ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ కానీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగిస్తున్నారు అంటే దానికి కారణం నాగేశ్వర రావు అని చెప్పక తప్పదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబం లో అత్యంత తెలివైన నటుడు ఎవరంటే ఇట్టే చెప్పే పేరు కింగ్ నాగార్జున.

చాల మందికి తెలియకపోవచ్చు కానీ నాగార్జున స్టడీస్ లో యావరేజ్ స్టూడేంట్ అయినా కానీ లెక్కల్లో మాత్రం కింగ్ అంటా. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే బోలెడూ వ్యాపారాలు స్టార్ట్ చేసి.. ఇండస్ట్రీలో ఎంతో మందికి వ్యాపారల్లో ఆదర్శంగా నిలిచారు. నాగార్జున కెరీర్ మొదట్లో పారితొషకానీ తక్కువ తీసుకున్నా ఆ తరువాత క్రమ క్రమంగా ఆ డిజిట్ ను పెంచుకుంటూ పోయాడు. ఇక తను సంపాదించిన ప్రతి రూపాయను ..ట్రిపుల్ అయ్యేలా తన తెలివితేటలతో బిజినెస్ చేసి..కోట్లు కూడ బెట్టుకున్నారట. అప్‌కమింగ్‌ స్టేజీలో ఉన్నప్పుడే మాటీవీలో పెట్టుబడులు పెట్టారు.

అక్కినేని నాగార్జున గతంలో రెండుసార్లు ఫోర్బ్స్‌ టాప్‌ 100 సెలబ్రిటీల లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రొడక్షన్‌ కంపెనీ అన్నపూర్ణ స్టూడియోస్‌కి నాగార్జున అక్కినేని కో-ఓనర్‌. ఈ స్టూడియో అనుబంధంగా ఇంటర్నేషనల్‌స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియాకు ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అంతేనా భార్య అమల అక్కినేనితో కలిసి బ్లూక్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎన్జీవోను నడిపిస్తున్నారు నాగ్‌.

చేతులో డబ్బులు ఉన్నప్పుడే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భూములు కొన్న నాగార్జున రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్న తర్వాత బాగా సంపాదించుకున్నారు ఏకంగా ట్రిపుల్ ప్రాఫిట్స్ సంపాదించి కోట్లు కూడబెట్టుకున్నారు అంటూ అప్పట్లో టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఇక నాగార్జున కి జగన్ ఒకప్పటి బిజినెస్ పార్ట్నర్ నిమ్మగడ్డ ప్రసాద్బాగా హెల్ప్ చేశాడట.

అప్పట్లో నిమ్మగడ్డ ద్వారా ఆనాటి ప్రభుత్వం లోని ముఖ్య నేతలతో ఫ్రెండ్ షిప్ ఏర్పర్చుకున్న నాగ.. హైదరాబాద్ లో రింగ్ రోడ్డు ప్రాజెక్టులు నాగ్ ప్రాపర్టీలు మీదగా వెళ్లడంతో ఆ భూముల ధర విపరీతంగా పెరిగిపోయాయట. స్వతహాగానే నాగార్జున క్=తెలివిపరుడు.. ఎప్పుడు ఎవరిని ఎక్కడ వాడాలో నాగార్జునకి బాగా తెలుసు..అందుకే ఎవరిని నొప్పించకుండా అందరు నా వాళ్ళే అంటూ తను లాభపడటానికి పక్క ప్లాన్ వేసుకుంటారు ఆయన అంటారు అందరు. ఇలా నిమ్మగడ్డ అండ్ కో ..రాజకీయ అనుబంధాల వల్ల నాగార్జున దాదాపు కొన్ని వేల కోట్ల వెనకేసుకున్నారట. ప్రస్తుతం ఈయన ఆస్తి విలువ 4 వేల కోట్లకు పైగానే ఉంటుందట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news