Moviesగుడ్ న్యూస్ కాదు అంతకుమించి..ఆ విషయంలో సమంత పిచ్చ హ్యాపీగా ఉందట....!!

గుడ్ న్యూస్ కాదు అంతకుమించి..ఆ విషయంలో సమంత పిచ్చ హ్యాపీగా ఉందట….!!

జనరల్ గా మన ఇంట్లో చిన్న వాళ్ళు ఉంటే మనం అడుగుతుంటాంగా.. నువ్వు పెద్ద అయ్యాక ఏమౌవుదాం అనుకుంటున్నావు రా అని. అప్పుడు వాళ్లు ఫన్నీగా డాక్టర్, ఇంజీనిర్, యాక్టర్, అంటూ చెప్పుతుంటారు. ఈ ప్రశ్న మన చిన్నప్పుడు కూడా మనకు ఎదురై ఉంటుంది. మనము ఇలాంటి ఆన్సర్ నే ఇచ్చి ఉంటాం. అయితే ఇక్కడ ఓ చిన్నారి మాత్రం ఎవ్వరు ఊహించని ఆన్సర్ ఇస్తుంది. నువ్వు పెద్ద అయ్యాక ఏమౌతావు పాప అని అడుగుతుంటే..సమంత లా అవుతా అంటుంది.

స్టార్ డమ్ ను దక్కించుకున్న సమంతకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సమంత అభిమానులను కలిగి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియాలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రతిభావంతులైన నటీమణులలో సమంత ఒకరు. ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే ఈ వీడియోని నెట్టింట పోస్ట్ చేసింది కూడా ఓ స్టార్ హీరోయిన్ నే.

ఆమె ఎవరో కాదు మహనటితో అందరి మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్. యస్..కీర్తి సురేష్ రీసెంట్ గా ఓ పాపకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ..”సమంత ఇక్కడ మీకు ఓ చిన్నారి డై హార్ట్ ఫ్యాన్ ఉంది. మీరు ఎలాగైన ఈ పాపను మీట్ అవ్వండి”అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ కు సమంత రిప్లై ఇస్తూ..ఎవరీ క్యూటీ అని ప్రశ్నించింది.

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇక దీని పై సమంత సన్నిహితుల దగ్గర స్పందిస్తూ నాలాగా అవ్వలి అని నన్ను ఆదర్శంగా తీసుకుంటున్న ఈ చిన్నారిని చూస్తే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పుకొచ్చిందట. అంతేకాదు ఎలాగైనా ఆ పాపను కలవడానికి వెళ్తా అంటుందట. నిజంగా ఇలాంటి అభిమానులు ఉండడం సమంత అదృష్టం అని అంటున్నారు పలువురు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news