Moviesఆ ఒక్క మాటే మ‌హేష్ ఫ్యాన్స్‌ను బాల‌య్య‌కు వీరాభిమానులుగా మార్చేసిందా..!

ఆ ఒక్క మాటే మ‌హేష్ ఫ్యాన్స్‌ను బాల‌య్య‌కు వీరాభిమానులుగా మార్చేసిందా..!

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా వ‌చ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలా అఖండ గ‌ర్జ‌న మోగించిందో చూశాం. ఈ సినిమా ఏకంగా రు. 200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా థియేట్రిక‌ల్ షేర్ ద్వారానే ఈ సినిమా రు. 150 కోట్లు కొల్ల‌గొట్టింది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మ‌లినేని గోపీచంద్ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇక అనిల్ రావిపూడి సినిమా కూడా లైన్లోనే ఉంది.

ఇదిలా ఉంటే బుల్లితెర‌పై బాల‌య్య హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాప‌బుల్ షో కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతోంది. మ‌హేష్‌బాబు ఎపిసోడ్‌తో ఫ‌స్ట్ సీజ‌న్ అన్‌స్టాప‌బుల్ ముగిసింది. ఈ జోష్‌తోనే ఇప్పుడు సెకండ్ సీజ‌న్‌కు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు బుల్లితెర రియాల్టీ షోల్లోనే అన్‌స్టాప‌బుల్ ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారింది. బాల‌య్య లాంటి ఓ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఈ రేంజ్‌లో టాక్ షోను న‌డిపిస్తార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. అంద‌రి అంచ‌నాల‌కు మించి బాల‌య్య ఈ షోను సూప‌ర్ హిట్ చేసిప‌డేశాడు.

తాజాగా మ‌హేష్‌బాబుతో బాల‌య్య చేసిన ఎపిసోడ్ చాలా ఎంట‌ర్టైనింగ్ గా సాగింది. బాల‌య్య మ‌హేష్‌బాబుపై స‌ర‌దాగా సెటైర్లు వేస్తూనే న‌వ్వించాడు. మ‌హేష్‌బాబు సీక్రెట్ పెళ్లి ప్ర‌స్తావ‌న కూడా తీసుకువ‌చ్చాడు. అయితే ఈ ఎపిసోడ్లో బాల‌య్య చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. మ‌హేష్‌ను ఉద్దేశించి నువ్వ కేవ‌లం న‌టుడివి మాత్ర‌మే కాదు… ఓ త‌రాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గ‌ద‌ర్శివి అని అన్నారు.

ఇప్పుడు బాల‌య్య చెప్పిన ఈ మాట బాగా వైర‌ల్ అవుతోంది. ఈ ఒక్క మాట‌ను మ‌హేష్ అభిమానులు బాగా వైర‌ల్ చేయ‌డంతో పాటు త‌మ అభిమాన హీరోను ఈ రేంజ్లో ఎత్తేయ‌డంతో వారంతా బాల‌య్య వీరాభిమానులుగా మారిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news