Moviesభీమ్లానాయ‌క్‌పై మ‌హేష్‌బాబు సంచ‌ల‌న పోస్ట్‌... ఆయ‌నంటే నాకు ఇష్టం అంటూ..!

భీమ్లానాయ‌క్‌పై మ‌హేష్‌బాబు సంచ‌ల‌న పోస్ట్‌… ఆయ‌నంటే నాకు ఇష్టం అంటూ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భీమ్లానాయ‌క్‌. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు కూడా వ‌స్తున్నాయి. ఇటు ఏపీ, తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే రు. 27 కోట్ల షేర్, అటు ఓవర్సీస్‌లో మిలియ‌న్ మార్క్ దాటేసి రెండు మిలియ‌న్ల దిశ‌గా దూసుకుపోతోంది.

భీమ్లానాయక్ సినిమాకు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు సినిమా రంగాలు, రాజ‌కీయ రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కూడా ఈ సినిమాపై స్పందించాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని.. ఇంకా చెప్పాలంటే నిప్పులు కురిపించేలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంద‌ని.. డేనియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి సంచ‌ల‌నం క్రియేట్ చేశాడ‌ని.. అత‌డి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంద‌ని చెప్పాడు.

ఇక మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ర‌చ‌న ఎప్ప‌టిలాగానే చాలా బ్రిలియంట్‌గా ఉంద‌ని.. ఇక ర‌వి కె.చంద్ర‌న్ అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చాడ‌ని.. నాకు బాగా ఇష్ట‌మైన లెన్స్‌మెన్ల‌లో అత‌డు కూడా ఒక‌రంటూ ర‌వికె. చంద్ర‌న్‌కు మ‌హేష్‌బాబు ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌లు ఇచ్చాడు. ఇక థ‌మ‌న్ మ్యూజిక్ అల్టిమేట్ అని చెప్పిన మ‌హేష్‌.. సినిమా ఓవ‌రాల్‌గా మిమ్మ‌ల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేస్తుంద‌ని చెప్పాడు.

ఇక భీమ్లానాయ‌క్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వేట అయితే మొద‌లు పెట్టేసింది. వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ప‌వ‌న్ వ‌రుస‌గా త‌న సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వెళుతున్నాడు. ఇక మ‌హేష్ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట మే 12న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news