లెజెండ్రీ సింగర్, గాన కోకిల లతా మంగేష్కర్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. భారత గానికోకిల గా పేరు సంపాదించుకున్న లతా మంగేష్కర్ తన 92 ఏళ్ల వయస్సులో మృతిచెందింది. ఈ మధ్య కాలంలోనే ఆమెకు కరోనా సోకగ్గా..చికిత్స తీసుకున్న తరువాత కోలుకుని బాగానే ఉన్నింది. కానీ సడెన్ గా మళ్ళీ ఏమైందో తెలియదు కానీ.. ఆమెకు ఆరోగ్యం బాగోలేక ముంబైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఇక అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది వారాల ముందు వరకు బాగానే యాక్టివ్‌గానే ఉన్నా ఆమె మృతికి కారణం ఏంటన్నది ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే సన్నిహితులు చెప్పుతున్న సమాచారం ప్రకారం లతాజీకి న్యూమోనియో ఉందని దానికి చికిత్స తీసుకుంటుందని.. ఇక దానికి తోడు కరోనా సోకడంతో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిన్నట్లు చెప్పుతున్నారు.
పరిస్ధితులు ఏవైనా..కారణాలు ఏన్నైనా లతాజీ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆమె మృతితో సంగీత ప్రపంచం మూగబోయిందనే చెప్పాలి. ఎంతోమంది సంగీత అభిమానులు లతాజీ మృతిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు లతాజీ మృతి తర్వాత అందరికి వచ్చిన డౌటు ఒకే ఒకటి. అసలు ఆమెకు ఎంత ఆస్తి ఉంది. ఇప్పుడు ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయి.
ఈ ప్రశ్న నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి తగ్గట్లే లతాజీ వీలునాయా బయటపడిం ది. ఇక దీని ప్రకారం ఆమె ఆస్తి అంతా కూడా లతాజీ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలకు చెందనున్నాయట. అలాగే తన తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్‌కు కూడా లతా ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లతాజీ తన తండ్రి పేరుతో ఒక ట్రస్ట్ ని నడుపుతున్నారు. ఆ ట్రస్ట్ కే ఆమె ఆస్తులన్నీ వెళ్లనున్నాయట. ఇక లతాజీ వీలునామాలో కూడా అలానే రాసారట. ఎందుకంటే ఆమె చెల్లెల్లు, సోదరుడు గాయకులుగా మంచి పోజిషన్లో ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్లకు డబ్బు అవసరం లేదు ఉన్న వాళ్ళు చూసుకోగలరు.
ఇక నా మరణం తరువాత ఈ సంస్ధలను ఎవరు చూసుకుంటారో ఎలా చూసుకుంటారో డబ్బులు ఎవరు ఇస్తారో అనే ప్రశ్నలు వేసుకున్న ఆమె తన ఆస్తి అంట..(అధికారిక లెక్కల ప్రకారం 203 కోట్లు) కూడా ఆమె నడుపుతున్న ట్రస్ట్ లకు వెళ్లాలి అని రాసారట. కొన్నిరోజుల్లో లతాజీ లాయర్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారట.మరి ఈ వార్త ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.