టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ఒక్కో హీరో పెళ్లి చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. గతేడాది వరకు బ్యాచిలర్ లిస్టులో ఉన్న రానా, నిఖిల్, నితిన్ ఓ ఇంటివాళ్లు అయిపోయారు. అయితే నాలుగు పదుల వయస్సుకు చేరువైన యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ? కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. మీడియాలో ప్రభాస్ పెళ్లిపై బాహుబలి ది బిగినింగ్ తర్వాత నుంచి కోకొల్లలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్లికి దూరంగానే ఉంటున్నాడు.
అయితే ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలోనే పెళ్లి టాపిక్ ఉంది. అది ఈ రోజు రిలీజ్ అయిన గ్లింప్స్‌లో బయటకు వచ్చింది. ప్రేమికుల రోజు కానుకగా రాధేశ్యామ్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో పూజా హెగ్డే – ప్రభాస్ మధ్య ఉన్న కెమిస్ట్రీని మరోసారి చూపించారు. చివర్లో ప్రభాస్‌ను పూజా హెగ్డే వంటలు ఇంత బాగా వండుతావ్ .. బాగా మాట్లాడతావ్… మరి ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు ? అన్న డైలాగ్ వేస్తుంది.
ఇది ప్రభాస్ రియల్ లైఫ్‌కు బాగా సూట్ అయ్యే ప్రశ్న ? అయితే ఈ గ్లింప్స్ లో ప్రభాస్ ఈ ప్రశ్నకు ఏమని ఆన్సర్ ఇచ్చాడన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఈ చిన్న సస్పెన్స్‌తో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రేమికుల రోజుకు రాధేశ్యామ్ నుంచి ఫర్ఫెక్ట్ గ్లింప్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ వీడియోతోనే రాధేశ్యామ్ ప్రచారం ప్రారంభించినట్టు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రకటించారు.
రు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ ఇందులో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నాడు. కొన్ని దశాబ్దాల క్రితం యూరప్‌లో జరిగిన ఓ యదార్థ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని అంటున్నారు.